ఓటీటీకి వచ్చేస్తోన్న కొరియన్ కనకరాజు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ABN , Publish Date - Aug 30 , 2026 | 04:24 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కొరియన్ కనకరాజు. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించారు.

Korean Kanakaraju

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), రితికా నాయక్ జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కొరియన్ కనకరాజు (Korean Kanakaraju). ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించారు. ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 7 న రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకుంది. భారీ పరాజయాల మధ్య సతమతమవుతున్న వరుణ్ కి ఈ సినిమా కొద్దిగా ఊరటను ఇవ్వడమే కాకుండా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. ముఖ్యంగా సత్య టైమింగ్, వరుణ్ తేజ్ కొత్త తరహా మేనరిజమ్స్ ప్రేక్షకులను థియేటర్లలో నవ్వుల్లో ముంచెత్తాయి.


ఇక ఈ హారర్-కామెడీ ఎంటర్టైనర్ ప్రస్తుతం డిజిటల్ ప్రిమియర్‌కు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 4 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే మేకర్స్ అధికారికంగా స్ట్రీమింగ్ డేట్ ని ప్రకటించనున్నారు.


కొరియన్ కనకరాజు కథ విషయానికొస్తే.. రాయలసీమలోని ఒక గ్రామానికి చెందిన కనకరాజు (వరుణ్ తేజ్) ఒక సాధారణ, పల్లెటూరి కుర్రాడు. అయితే ఒక పురాతన వస్తువు ద్వారా కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మ భారతదేశానికి వచ్చి అనూహ్యంగా కనకరాజు శరీరంలోకి ప్రవేశిస్తుంది. దాంతో సీమ కుర్రాడైన కనకరాజు కొరియన్ భాష మాట్లాడుతూ, విచిత్రమైన ప్రవర్తనతో చేసే హంగామా అంతా ఇంతా కాదు. తన మిత్రుడు (సత్య) సాయంతో ఈ ఆత్మ గొడవ నుంచి ఎలా బయటపడ్డాడు, ఈ క్రమంలో కథలోకి వచ్చిన కథానాయిక (రితికా నాయక్)తో ఎలాంటి సంబంధం ఉందనేది మిగతా కథ. మరి థియేటర్ లో మంచి హిట్ అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.

Updated Date - Aug 30 , 2026 | 04:24 PM