కొరియన్ కనకరాజు కోసం మెగా ప్రిన్స్ గట్టిగానే కష్టపడుతున్నాడే ..
ABN , Publish Date - Jul 24 , 2026 | 10:24 PM
ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చి కంచె సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్ (Varun Tej). తన విభిన్నమైన నటనతో తొలిప్రేమ, ఫిదా, ఎఫ్ 2 వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకుని బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేశాడు.
ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చి కంచె సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్ (Varun Tej). తన విభిన్నమైన నటనతో తొలిప్రేమ, ఫిదా, ఎఫ్ 2 వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకుని బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేశాడు. అయితే గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేకపోవడంతో ఆయన కెరీర్ కాస్త మందగించింది. దీంతో ఎలాగైనా సరే మళ్లీ గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో వరుణ్ తేజ్ గట్టిగా కష్టపడుతున్నారు. ప్రస్తుతం వరుణ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదనే పెట్టుకున్నాడు.
మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆగస్టు 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో వరుణ్ తేజ్ ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. ఈ సినిమా ప్రమోషన్లలో వరుణ్ తేజ్ చూపిస్తున్న డెడికేషన్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల కాలికి తీవ్ర గాయమై సరిగ్గా నడవలేని పరిస్థితి ఉన్నప్పటికీ, ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా చేతికర్ర సాయంతో నడుస్తూనే ప్రమోషన్లలో ముమ్మరంగా పాల్గొంటున్నాడు. ప్రమోషన్లలో భాగంగా రాయలసీమ పర్యటనకు వెళ్లిన ఆయన, అక్కడి స్థానిక రాయలసీమ రుచులను ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వరుస ప్లాప్‌ల నుంచి బయటపడి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలనే తపనతో, నొప్పులను కూడా తట్టుకుని వరుణ్ తేజ్ ఈ ప్రమోషన్స్ చేస్తున్నాడు. కామెడీ టచ్ ఉన్న యాక్షన్ థ్రిల్లర్ గా కొరియన్ కనకరాజు తెరకెక్కింది. మెగా ఫ్యామిలీకి కామెడీ సినిమాలు బాగా కలిసి వచ్చాయి. ఇక ఇప్పుడు వరుణ్ కూడా అదే జానర్ లో రాబోతున్నాడు. దీంతో ఈ సినిమా కచ్చితంగా హిట్ కొడుతుందని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాతో వరుణ్ తేజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.