మెగా ప్రిన్స్ నెక్స్ట్ సినిమా.. దర్శకుడు ఎవరంటే..
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:10 PM
మెగా హీరోల్లో వరుణ్ తేజ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన కథల ఎంపిక కొత్తగా ఉంటుంది. కొన్ని హిట్ సినిమాల తర్వాత కమర్షియల్ కథల బాట పట్టాడు.
మెగా హీరోల్లో వరుణ్ తేజ్‌కు (Varun Tej) ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన కథల ఎంపిక కొత్తగా ఉంటుంది. కొన్ని హిట్ సినిమాల తర్వాత వైవిధ్యమైన కథల బాట పట్టాడు వరుణ్ తేజ్. అయితే ఈ మధ్యకాలంలో ఆయనకు సరైన హిట్ లభించలేదు. సరైన సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన 'కొరియన్ కనకరాజు’ సినిమా చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం మెగా ప్రిన్స్ మరో కథను ఓకే చేశారు.
‘కమిటీ కుర్రాళ్లు’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన యదు వంశీ (yadu Vamsi) ఇప్పుడు వరుణ్‌తో ఓ సినిమా చేయనున్నారట. కథ కూడా లాక్ అయిందని ఉగాదికి లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిసింది. నిహారిక ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. తాజాగా నిహారిక నిర్మించిన ‘రాకాసా’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. అలాగే మారుతి దర్శకత్వంలో వరుణ్ ఓ సినిమా చేస్తారనే టాక్ కూడా నడుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. వరుణ్ కు నేరెషన్ ఇచ్చే పనిలో మారుతి ఉన్నారట. ఆ తర్వాతే ఈ సినిమాపై ఓ క్లారిటీ వస్తుంది.