ఎన్టీఆర్ పై ట్రోలింగ్.. స్పందించిన వరుణ్ తేజ్

ABN , Publish Date - Aug 07 , 2026 | 04:46 PM

ఈమధ్య సినిమాల్లో ఇమిటేషన్స్ ఎక్కువ అయ్యిపోయాయి. సీనియర్ హీరోలను.. వారి పాటలను, డ్యాన్స్ లను కుర్ర హీరోలు ఇమిటేట్ చేస్తున్నారు. కొన్నిసార్లు ఆ ఇమిటేషన్స్ ని కొందరు నెగిటివ్ గా తీసుకొంటున్నారు.

Korean Kanakaraju

ఈమధ్య సినిమాల్లో ఇమిటేషన్స్ ఎక్కువ అయ్యిపోయాయి. సీనియర్ హీరోలను.. వారి పాటలను, డ్యాన్స్ లను కుర్ర హీరోలు ఇమిటేట్ చేస్తున్నారు. కొన్నిసార్లు ఆ ఇమిటేషన్స్ ని కొందరు నెగిటివ్ గా తీసుకొంటున్నారు. తాజాగా కొరియన్ కనకరాజు (Korean Kanakaraju) సినిమాలో సత్య.. సీనియర్ ఎన్టీఆర్ ని ఇమిటేట్ చేయడంతో సోషల్ మీడియా భగ్గుమంది. చాలామంది సీనియర్ ఎన్టీఆర్ ని అవమానించారంటూ మండిపడుతున్నారు. ఇక చాలా గ్యాప్ తరువాత ఘనవిజయాన్ని అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. తాజా ప్రెస్ మీట్ లో సినిమా విశేషాలతో పాటు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన వివాదంపై స్పందించాడు. ప్రీమియర్ షోల నుంచే ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ పట్ల ఆయన ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.


'గత సినిమాలతో పోలిస్తే ఈసారి చాలా మంచి కంటెంట్ ఉన్న సినిమా చేశామనే నమ్మకం ఉంది. ప్రతి సన్నివేశాన్ని మేమంతా చాలా ఎంజాయ్ చేస్తూ చిత్రీకరించాం. ముఖ్యంగా సత్యతో చేసిన కామెడీ సీక్వెన్స్‌లకు థియేటర్లలో వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఎంకరేజింగ్‌గా ఉంది' అని చెప్పుకోచ్చాడు. ఇక అమెచ్యూరిష్ సీన్‌పై నెట్టింట జరుగుతున్న చర్చల గురించి వరుణ్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సన్నివేశాన్ని తాము నవంబర్ నెలలోనే షూట్ చేశామని, దీని వెనుక ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశాడు.


'ఇమిటేషన్‌కు, ట్రోలింగ్‌కు చాలా తేడా ఉంటుంది. ఒక గొప్ప నటుడిని ఇమిటేట్ చేయడం అనేది వారి పట్ల గౌరవంతో చేసేది. మేము చాలా హెల్తీగా, కేవలం ఫన్ కోసం మాత్రమే చేశాం. కావాలని ఎవరినీ ట్రోల్ చేయలేదు, ఎవరినీ అగౌరవపరచడం మా ఉద్దేశం కానే కాదు' అని వరుణ్ తేజ్ తన వివరణ ఇచ్చాడు. కేవలం కామెడీపైనే పూర్తి ఫోకస్ పెట్టి రూపొందించిన ' కొరియన్ కనకరాజు' చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోందని, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను బాగా ఆస్వాదిస్తున్నారని ఆయన తెలిపాడు. కెరీర్ పరంగా వరుస పరాజయాల తర్వాత వరుణ్ తేజ్ చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం కావడంతో, ఆయన అభిమానులు ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మెర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన ఈ హారర్ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది.

Updated Date - Aug 07 , 2026 | 04:54 PM