Bhari: మెగా అభిమానులకు స్పెషల్ ట్రీట్.. తొలిసారి ఒకే తెరపై తండ్రీకొడుకులు

ABN , Publish Date - Aug 06 , 2026 | 10:32 AM

మెగా అభిమానులకు ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌(varun Tej), ఆయన తండ్రి నాగబాబు (Naga Babu) తొలిసారి ఒకే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.

మెగా అభిమానులకు ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌(varun Tej), ఆయన తండ్రి నాగబాబు (Naga Babu) తొలిసారి ఒకే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బరి’(Bhari) చిత్రం ఈ అరుదైన కాంబినేషన్‌ను సెట్ చేసింది.  నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తుండగా, నాగబాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి పుష్కరకాలం అవుతున్నా.. ఇప్పటివరకు తండ్రి నాగబాబుతో కలిసి తెరపై కనిపించే అవకాశం రాలేదు. తండ్రీకొడుకులను ఒకే ఫ్రేమ్‌లో చూడాలన్నది మెగా అభిమానుల  కోరికను ‘బరి’ చిత్రం తీర్చబోతోంది. తొలిసారి వరుణ్ తేజ్‌, నాగబాబు కలిసి నటించనుండటం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఈ ఆసక్తికర విషయాన్ని వరుణ్ తేజ్ స్వయంగా వెల్లడించారు. తాజాగా ఎన్‌ఆర్‌ఐ అభిమానులతో నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో 'బరి’లో తన తండ్రి నాగబాబుతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలిపారు. దీంతో ఈ వార్త మెగా అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.

మరి సినిమాలో నాగబాబు పాత్ర ఏంటి? నిజ జీవితంలో తండ్రీకొడుకులైన వీరిద్దరూ సినిమాలోనూ అదే బంధంలో కనిపిస్తారా? లేక దర్శకుడు యదు వంశీ వీరి కోసం భిన్నమైన పాత్రలను సిద్ధం చేశారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా వరుణ్ తేజ్‌-నాగబాబు తొలి ఆన్‌స్క్రీన్ కలయిక మాత్రం ‘బరి’పై అంచనాలను మరింత పెంచుతోంది. ఏ ఏడాది అక్టోబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' చిత్రం ప్రమోషన్స్లో బిజీ గాగా ఉన్నారు. ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకుకు రానుంది.  మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకుడు. 

Updated Date - Aug 06 , 2026 | 10:59 AM