‘యద్భావం తద్భవతి’ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే!

ABN , Publish Date - Nov 25 , 2026 | 04:36 PM

వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ‘యద్భావం తద్భవతి’ సినిమా విడుదల వాయిదా పడింది. నవంబర్ 27న రావాల్సిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 18న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

Yadbhavam Tadbhavati movie

రమేష్ జక్కల దర్శకత్వంలో ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి నిర్మాతగా రూపుదిద్దుకున్న సినిమా 'యద్భావం తద్భవతి'. వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇనయ సుల్తానా, రేణుశ్రీ హీరోయిన్స్‌గా నటిస్తుండగా సుమన్, నాగ మహేష్, లోహిత్ కుమార్, ధనరాజ్, శ్వేత వర్మ, దయానంద్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్యామ్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి మిహిరామ్ సంగీతం అందించగా ఈ సినిమా పాటలను కే మ్యూజిక్ ద్వారా చిత్ర బృందం విడుదల చేసింది. ఇదిలా ఉంటే నవంబర్ 27న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు దీనిని వాయిదా వేసినట్టు మేకర్స్ తెలిపారు. అనివార్యంగా సినిమాను పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చిందని, అన్ని అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ 18న విడుదల చేస్తామని అన్నారు.

Updated Date - Nov 25 , 2026 | 04:52 PM