స్టేజ్‌పై.. క‌న్నీళ్లు పెట్టుకున్న 'జ‌య‌మ్మ‌'

ABN , Publish Date - Feb 22 , 2026 | 07:28 AM

వరలక్ష్మి శరత్‌కుమార్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించి, న‌టించిన చిత్రం స‌ర‌స్వ‌తి. తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ చేశారు.

‘వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) చాలా అద్భుతమైన వ్యక్తి. నా సినిమా ‘క్రాక్‌’లో జయమ్మ పాత్రలో ఆమె పరకాయ ప్రవేశం చేసిన విధానం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె ‘సరస్వతి’ (Saraswathi) కథ చెప్పినప్పుడు విని షాక్‌ అయ్యాను. ఈ సినిమాను థియేటర్‌లో చూసే ప్రేక్షకులు థ్రిల్‌ అవుతారు. ప్రతి తల్లితండ్రి చూడాల్సిన గొప్ప సినిమా ఇది’ అని దర్శకుడు గోపీచంద్‌ మలినేని అన్నారు.


వరలక్ష్మి శరత్‌కుమార్‌ స్వీయ దర్శకత్వంలో నటించిన‌ చిత్రం ‘సరస్వతి’. పూజ శరత్‌కుమార్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. మార్చి 6న చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను గోపీచంద్‌ మలినేని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వరలక్ష్మి మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో సందేశంతో పాటు వాణిజ్య హంగులు ఉన్నాయి. అందరూ ఈ సినిమాను ఆదరించి ఇండస్ట్రీలో మహిళలను ప్రోత్సహించాలని కోరుతున్నాను’ అని చెప్పారు. ద‌ర్శ‌కుడు మ‌లినేని గోపిచంద్ గురించి మాట్లాడుతూ.. ఇది నాకు రెండో జన్మ అంటూ భావోద్వేగం చెంది స్టేజ్‌పై క‌న్నీళ్లు పెట్టుకున్నారు.

ఇదిలాఉంటే.. ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మితో పాటు ప్రియ‌మ‌ణి, క‌న్న‌డ కిశోర్‌, ప్ర‌కాశ్ రాజ్‌వంటి ప్ర‌ముఖ న‌టులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. తాజాగా విడుద‌ల చేసిన ట్రైల‌ర్ సైతం థ్రిల్లింగ్ స‌న్నివేశాల‌తో ఇట్టే ఆక‌ట్టుక‌నేలా ఉంది.

Updated Date - Feb 22 , 2026 | 07:28 AM