ఆడ వారికి ధైర్యాన్నిచ్చే చిత్రం ‘సరస్వతి’.. ఇలాంటి కథలు అరుదుగా వస్తాయి

ABN , Publish Date - Mar 02 , 2026 | 06:27 AM

వరలక్ష్మి శరత్‌కుమార్ కీల‌క పాత్ర పోషిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించి, నిర్మించిన‌ చిత్రం స‌ర‌స్వ‌తి. మార్చి6న థియేట‌ర్ల‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో ఆదివారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు.

Varalaxmi Sarath Kumar

‘సరస్వతి’ (Saraswathi) చిత్రంలోని ప్రతీ పాత్రా చాలా అర్థవంతంగా ఉంటుంది. ప్రకాశ్‌రాజ్‌, ప్రియమణి తన నటనతో ఈ సినిమాకు ప్రాణం పోశారు. ప్రేక్షకులకు మంచి సందేశం ఇస్తూనే ఆద్యంతం అలరిస్తుంది’ అని అన్నారు వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarath Kumar). ఆమె ప్రధానపాత్రలో నటించి తెరకెక్కించిన చిత్రం ‘సరస్వతి’.

దోశ డైరీస్‌ బ్యానర్‌పై వరలక్ష్మి శరత్‌కుమార్‌, పూజ శరత్‌కుమార్‌ నిర్మించారు. ఈనెల 6న విడుదలవుతున్న సందర్భంగా ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఇంకా వ‌ర‌ల‌క్ష్మి మాట్లాడుతూ.. సొంత మ‌ద‌ర్ కాక‌పోయినా న‌న్ను అనుక్ష‌ణం గైడ్ చేస్తూ నాకు మంచి స‌పోర్ట్ ఇచ్చిన రాధిక గారి గురించి ఎంత చెప్పినా త‌క్కువే అని క‌న్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో నటుడు శరత్‌కుమార్‌ మాట్లాడుతూ ‘సరస్వతి’ లాంటి కథను కచ్చితంగా చెప్పి తీరాలి. స్త్రీలను గౌరవించడం మన కర్తవ్యం. ఈ సినిమా ప్రేక్షకుల ప్రేమను పొందుతుంది’ అని చెప్పారు. ‘ఆడ వారికి ధైర్యాన్నిచ్చే చిత్రం ‘సరస్వతి’. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తుంటాయి.

ఈ కథను వరలక్ష్మి తెరకెక్కించినందుకు గర్వంగా ఉంది’ అని రాధికా శరత్‌కుమార్‌ తెలిపారు. వ‌ర‌ల‌క్ష్మి సినిమాల్లోకి వెళ‌తా అంటే శ‌ర‌త్ కుమార్ అంగీక‌రించ‌లేద‌ని ఆపై మేమంతా బ‌ల‌వంతం చేయ‌డం వ‌ళ్ల అంగీక‌రించార‌న్నారు. ఇక త‌మిళం క‌న్నా తెలుగులో చేస్తే ఇంకా బాగా గుర్తింపు వ‌స్తుంద‌ని, ఆ ఇండ‌స్ట్రీని నీకు స‌రైంద‌ని, మంచి పాత్ర‌లు ప‌డ‌తాయ‌ని చెప్పాన‌ని రాధిక తెలిపారు.

Updated Date - Mar 02 , 2026 | 06:27 AM