సాయి మాధవ్ గారు 'రేప్' అనే పదం వాడకుండా ఉండాల్సింది
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:56 PM
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తొలిసారి మెగా ఫోన్ పట్టి రూపొందించిన చిత్రం 'సరస్వతి'. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (Vara Lakshmi sarathkumar) తొలిసారి మెగాఫోన్ పట్టి రూపొందించిన చిత్రం 'సరస్వతి' (Saraswathi). ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. టాలీవుడ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా (Sai madhav burra)ఈ చిత్రానికి కథ అందించారు. ప్రమోషన్స్‌లో ఆయన పేరు ఎక్కడా వినిపించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 'నా కథతో మొదలై వేరే కథతో పూర్తవుతుంది. ఒక్కమాట చెప్పకుండా ఇష్టమొచ్చినట్టు మార్చేసుకున్నారు. కథని మానభంగం చేశారు. నాది రివెంజ్ డ్రామా కాదు. నా సోల్ వేరు.. అసలా కథే వేరు’ అని సాయి మాధవ్ బుర్రా సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనితో ఈ విషయం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం శనివారం సక్సెస్ మీట్ ని నిర్వహించింది. సాయి మాధవ్ బుర్రా చేసిన ఆరోపణలపై వరలక్ష్మీ శరత్‌కుమార్ స్పందించారు. సాయి మాధవ్ బుర్ర అంతగా రియాక్ట్ కావడం వెనుక ఏం జరిగింది? అని వరలక్ష్మీని ప్రశ్నించగా ఆమె ఆసక్తికరంగా స్పందించింది.
'సాయిగారి మీద చాలా గౌరవం ఉన్నాయి. ఆయనొక సీనియర్ రైటర్. అయితే ఓ కథని అలాగే చెబితే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరు. నేను ఎవరి కథని దొంగిలించలేదు.. కాంట్రాక్ట్ చేసుకుని. డబ్బులిచ్చాం. అన్నీ ఇచ్చిన తరువాత ఆ కథ నాదైంది. ఇదే కథ సాయి మాధవ్ వద్ద గత ఆరేళ్లుగా ఉంది. అంత బాగుంటే ఆయనే ఎందుకు చేయలేదు?. సినిమా చూసిన చాలా మంది సెకండ్ హాఫ్ బాగాలేదన్నారు. కథా రచయిత మీతో పాటు కూర్చుని వర్క్ చేసుంటే బావుందేది అని సలహా ఇచ్చారు. సాయి గారు చాలా బిజీ..ఆయన ఇప్పుడు అన్నీ పెద్ద సినిమాలు చేస్తున్నారు. మొత్తం కథని ఓ ఆడియో నోట్‌లో పంపించారు. ఆడియో నోట్ లోంచి నేను ఎంత కావాలో అంతే తీసుకున్నా, దానిపై వర్క్ చేశాను. నేను ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలోనూ ఆ కథ లైన్ మాత్రమే తీసుకున్నాను అని చెప్పాను. స్క్రీన్ ప్లే మార్చి రాసుకున్నాను. సాయి మాధవ్ బుర్రాగారిపై ఉన్న మర్యాద వల్ల స్టోరీకి ఆయన పేరే వేసాను. ఇప్పుడు చాలా మంది రకరకాలుగా మాట్లాడుతుంటే అది ఆయనకు దక్కిన గౌరవమా? నాకు దక్కిన గౌరవమా? మీరే చెప్పాలి.. అదే నా లాజిక్` అని ఆమె అన్నారు.
స్టోరీ తీసుకున్నప్పుడు ఆయనకు చెప్పకుండా మార్చకూడదు కాదా? అన్న ప్రశ్నకు ఆయన ఫోన్‌లో దొరికితే కాదా అని ఎదురు ప్రశ్నించారు వరలక్ష్మీ. ఆయనకు పెద్ద సినిమాలు ఉండటం వల్ల కలవడం కుదరలేదు. మీరు బిజీగా ఉన్నారు కదా నేను చూసుకుంటాను అని చెప్పగా ఒప్పుకున్నారు. అలా నేను సెన్సిటీవ్ ఇష్యూమీద సినిమా తీస్తే కథని రేప్ చేశారంటూ కామెంట్ చేయడం ఏమీ బాగాలేదు. ఆయన ప్రవర్తించిన తీరు ఎక్స్‌ట్రీమ్‌లీ రూడ్. నేను ప్రతి ఒక్కరికీ గౌరవిస్తున్నాను. సినిమా డైరెక్ట్ చేసే నిర్ణయం తీసుకున్నానంటే దాని వెనుక ఎంత పెద్ద విషయం నడిచి ఉంటుంది?. అదంతా నడిచిన తరువాతే ఇదంతా వచ్చింది. నేను మాత్రం అంత తక్కువ స్థాయిలో మాట్లాడే వ్యక్తిని కాదు` అన్నారు.