మాట దొర్లాను.. దయచేసి క్షమించండి

ABN , Publish Date - Feb 26 , 2026 | 05:21 PM

ఇటీవ‌ల.. ఓ ఈవెంట్‌లో నంది అవార్డుల విష‌యంలో నిర్మాత వంశీ నందిపాటి చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే.

vamsi nandipati

ఇటీవ‌ల సాంప్ర‌దాయిని సుద్ద‌పూస‌ని రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ సంద‌ర్భంగా నిర్మాత వంశి నందిపాటి (Vamsi Nandipati) న‌టి ల‌య గురించి త‌న‌కు వ‌చ్చిన నంది అవార్డుల (Nandi Awards) గురించి మాట్లాడుతూ.. నందుల‌న్నీ పందుల్లా ల‌య వాళ్లింటికి వెళ్లిపోయాయి అంటూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ఇది కాస్త బాగా వైర‌ల్ అయి వంశీపై విమ‌ర్శ‌లు రాగా నెట్టింట తెగ ట్రోలింగ్ జ‌రిగింది.

ఈ నేప‌థ్యంలో తాజాగా.. గురువారం హేబల్‌వంత్‌ (Hey Balwanth) స‌క్సెస్ మీట్ జ‌రుగ‌గా వంశీ హ‌జ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రీసెంట్‌గా త‌ను చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవ‌డంపై స్పందించి క్ష‌మాప‌ణ‌లు కోరారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. ''ఈవెంట్‌లో చిన్నగా మాట దొర్లాను. అది నా స్టేట్‌మెంట్‌ కాదు. తప్పుగా వెళ్లింది. ఎవరో 12 సంవత్సరాల క్రితం ఎవరో అన్న స్టేట్‌మెంట్‌ను గుర్తు చేశాను. అప్పట్లో ఇలా అనేవారు అన్నారు. నాకు దేవుడి మీద , అవార్డ్స్‌ మీద అపారమైన గౌరవం ఉంది.

దేవుడి అంటే ఎంతో భక్తి ఉందో, అవార్డ్స్‌ మీద కూడా గౌరవం ఉంది. నాకు చిన్నప్పటి నుంచి నంది అవార్డ్స్‌ లాంటి అవార్డు అందుకోవాలని ఆశగా ఉండేది. ఆ కలతోనే సినీ పరిశ్రమకు వచ్చాను. ఇలాంటి గొప్ప అవార్డ్స్‌ గురించి నేను తప్పుగా మాట్లాడను. నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉండే ఐయామ్‌ రియల్లీ సారీ' అన్నారు. ఈ సమావేశంలో స్రవంతి చొక్కారపు, లావణ్యరెడ్డి, మహి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2026 | 05:21 PM