Transfer Trimurthulu: పదేళ్ళలో 55 ట్రాన్స్ ఫర్స్ .. ఎవరీ త్రిమూర్తులు
ABN , Publish Date - May 21 , 2026 | 06:37 PM
ప్రస్తుతం ఇండస్ట్రీలో రీఎంట్రీలు చాలా స్పెషల్ గా ఉంటున్న విషయం తెల్సిందే. ఒకప్పుడు ప్రేక్షకులను అలరించిన నటీనటులు మధ్యలో ఫ్యాప్ తీసుకొని సరికొత్తగా రీఎంట్రీలు ఇస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో రీఎంట్రీలు చాలా స్పెషల్ గా ఉంటున్న విషయం తెల్సిందే. ఒకప్పుడు ప్రేక్షకులను అలరించిన నటీనటులు మధ్యలో ఫ్యాప్ తీసుకొని సరికొత్తగా రీఎంట్రీలు ఇస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోలు విలన్స్ గా, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ మెప్పిస్తున్నారు. తాజాగా మరో సీనియర్ హీరో టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్నారు. ఆయనే వడ్డే నవీన్ (Vadde Naveen).
పెళ్ళి సినిమాతో నవీన్ ఎంతో మంచి గుర్తింపును అందుకున్నారు. ఆ తరువాత ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో నటించి మెప్పించిన నవీన్ కొంత గ్యాప్ తీసుకొని ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు సినిమాతో మళ్ళీ హీరోగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. కమల్ తేజ్ నార్ల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను వడ్డే నవీనే నిర్మించడం విశేషం. ఇక ఈ సినిమాలో రాశీ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. నీతి, నిజాయితీ కలిగిన కానిస్టేబుల్ త్రిమూర్తులుగా నవీన్ కనిపించారు. పదేళ్ళలో 55 ట్రాన్స్ ఫర్స్ తీసుకున్న త్రిమూర్తులు ఒక కేసులో ఇరుక్కుంటాడు. అతని కోసం పోలీసులు వెతుకుతూ ఉంటారు. అసలు త్రిమూర్తులు చేసిన నేరం ఏంటి.. ? పోలీసులు ఎందుకు అతనిని వెతుకుతున్నారు. కోర్టులో త్రిమూర్తులు కేసు ఏమైంది.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. టీజర్ యూత్ కి నచ్చేలా మాస్ ఎలిమెంట్స్ పెట్టి కట్ చేసిన విధానం బావుంది. జూన్ 19 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో వడ్డే నవీన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.