దర్శకుల సంఘం అధ్యక్షుడిగా.. వి.ఎన్‌.ఆదిత్య

ABN , Publish Date - Mar 08 , 2026 | 05:23 PM

తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికలు ఆదివారం మధ్యాహ్నానికి పూర్తయ్యాయి. లెక్కింపు అనంతరం ఫలితాలను వెల్లడించారు.

తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికలు (TFDA Elections) ఆదివారం మధ్యాహ్నానికి పూర్తయ్యాయి. లెక్కింపు అనంతరం ఫలితాలను వెల్లడించారు. వి.ఎన్‌ ఆదిత్య (Vn Adithya) ఎంపవర్‌ ప్యానెల్‌ ఘనవిజయం సాధించింది. దర్శకుల సంఘం నూతన అధ్యక్షుడిగా వి ఎన్‌ ఆదిత్య గెలుపొందారు. వైస్‌ ప్రెసిడెంట్‌గా సముద్ర, ప్రధాన కార్యదర్శిగా రామారావు, కోశాధికారిగా సాయిరాజేశ్‌ నీలం ఎంపికయ్యారు. సాయిరాజేశ్‌ 938 ఓట్లతో గెలుపొందారు.

ఈ సందర్భంగా వి ఎన్ ఆదిత్య మాట్లాడుతూ 'మా ప్యానెల్లో 18 మంది పోటీ చేస్తే 16 మంది గెలిచారు. నన్ను డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా గెలిపించిన అందరికి ధన్యవాదములు.  అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తాం. ఎన్నికల వేళా ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. అసోసియేషన్ సభ్యులకు ఆరోగ్య భద్రత, సినిమా నిర్మాణం లో సహాయం చేస్తాం'. అని అన్నారు. 


vallabahneni.jpg

మరోపక్క తెలుగు సినీ, టీవీ జూనియర్‌ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికలు కూడా జరిగాయి. దీనిలో వల్లభనేని అనిల్‌ ప్యానెల్‌ ఘన విజయం సాధించింది. 1390 ఓట్ల భారీ మెజారిటీతో అనిల్‌ గెలుపొందారు.  ప్రధాన కార్యదర్శిగా పి. రవి, ట్రెజరర్‌గా రవీందర్ ఎన్నికయ్యారు. 'సినీ  కార్మికుల, జూనియర్ ఆర్టిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం' అని వల్లభనేని  అనిల్ కుమార్ అన్నారు. 

Updated Date - Mar 09 , 2026 | 02:27 PM