ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు
ABN , Publish Date - Mar 07 , 2026 | 08:11 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) - హరీష్ శంకర్ (Harish Kalyan) కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎన్ని రికార్డులు సృష్టించిందో అందరికీ తెల్సిందే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) - హరీష్ శంకర్ (Harish Kalyan) కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎన్ని రికార్డులు సృష్టించిందో అందరికీ తెల్సిందే. చాలా గ్యాప్ తరువాత వీరి కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా నటించారు. ఇప్పటికే ఉస్తాద్ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రచారాలు మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ట్రైలర్ టీజ్ అంటూ ఒక చిన్న గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.
ట్రైలర్ టీజ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ధర్మ సంరక్షణముల కొరకు ప్రతియుగమున అవతారం దాల్చుచున్నాను అనే లైన్ తో ఈ గ్లింప్స్ మొదలయ్యింది. ఇక పవన్ అలా గన్ పట్టుకొని ఇందాక విన్నది భగవద్గీత.. ఇది భగత్ గీత.. దమ్మునోడు దాటొచ్చు అనే డైలాగ్ చెప్పడంతో ఎండ్ చేశారు. పవన్ చెప్పింది ఒక్క డైలాగ్ అయినా కూడా దాని ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పొచ్చు.
ముఖ్యంగా ఈ గ్లింప్స్ లో ప్రతి ఫ్రేమ్ లో కూడా పవన్ క్యాప్ తోనే కనిపించారు. దీంతో ఫ్యాన్స్ అందరూ బద్రి సినిమాలో చికితా సాంగ్ లో పవన్ ని దింపేశారు హరీష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. త్వరలోనే ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమాతో గబ్బర్ సింగ్ కాంబో మరో విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.