ఉస్తాద్ భగత్‌సింగ్’: ఆ ఫుటేజ్ చూసి ఓటీటీ గ్రీన్‌సిగ్నల్..
ABN , Publish Date - Mar 07 , 2026 | 10:13 AM
పవన్‌కల్యాణ్ (pawan Kalyan) 'ఉస్తాద్ భగత్‌సింగ్’గా Ustad bhagat singh) అలరించడానికి సిద్దమవుతున్నారు. ‘గబ్బర్‌సింగ్’ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత పవన్, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
పవన్‌కల్యాణ్ (pawan Kalyan) 'ఉస్తాద్ భగత్‌సింగ్’గా Ustad bhagat singh) అలరించడానికి సిద్దమవుతున్నారు. ‘గబ్బర్‌సింగ్’ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత పవన్, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నెల 26న విడుదల కావలసిన ఈ చిత్రం వారం ముందే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు హరీశ్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమాకు మంచి ఓటీటీ డీల్ (Netflix ott) వచ్చిందని, దాదాపు రూ.80 కోట్లకు ఓటీటీ డీల్‌ను నెట్‌ఫ్లిక్స్ క్లోజ్ చేసిందని ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి.
దీనిపై మరింత అప్‌డేట్ ఇచ్చారు దర్శకుడు. సినిమా షూటింగ్ మొదలైన కొన్ని రోజుల్లోనే ఓటీటీ డీల్ కుదిరినట్లు తెలిపారు. ‘పర్సనల్‌గా సినిమాను చెక్ చేసుకోవడానికి నేను కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేసి ఓ పుటేజ్ రెడీ చేసుకున్నా. ఆ విజువల్స్ చూసిన నెట్‌ఫ్లిక్స్ టీమ్ సినిమాపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ క్లిప్స్‌లో కంటెంట్, మేకింగ్ స్టైల్ నచ్చడంతో 20 నిమిషాల్లోనే డీల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు’ అని అన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా నాయికలు.