Ustaad Bhagat Singh: ఉస్తాద్ రిలీజ్ డేట్ వచ్చేసిందిరోయ్..

ABN , Publish Date - Feb 04 , 2026 | 05:19 PM

ట్టకేలకు ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఎప్పుడెప్పుడు ఉస్తాద్ రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసిన అభిమానులకు ఒక క్లారిటీ వచ్చేసింది.

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh: ఎట్టకేలకు ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఎప్పుడెప్పుడు ఉస్తాద్ రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసిన అభిమానులకు ఒక క్లారిటీ వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా హరీశ్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. అభిమాని నుంచి దర్శకుడిగా మారిన హరీశ్ శంకర్, పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ తెరకెక్కించి ఎంతటి సంచలనాలు సృష్టించారో తెలిసిందే. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తో అంతకుమించిన సంచలనాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. కుటుంబాలతో కలిసి ప్రేక్షకులు థియేటర్లకు తరలి వెళ్లి, పవర్‌ప్యాక్డ్ వినోదాన్ని ఆస్వాదించేలా ఈ సినిమాను రూపొందించినట్లు సమాచారం.

ఇప్పటికే ఉస్తాద్ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా హైప్ కూడా పెంచేశాయి. ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకోంటుంది. ఇక తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.

మొదట ఈ డేట్ న న్యాచురల్ స్టార్ నాని నటించిన ది ప్యారడైజ్ రానున్నట్లు ప్రకటించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మోహన్ బాబు విలన్ గా నటిస్తున్నారు. మొదటి నుంచి కూడా మార్చి 26 నే ప్యారడైజ్ రిలీజ్ కానుందని చెప్తూ వచ్చారు. కానీ, ఈ సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడంతో ప్యారడైజ్ వెనక్కి తగ్గింది. ఆ డేట్ ను ఉస్తాద్ ఒడిసిపట్టాడు. సమ్మర్ కానుకగా ఉస్తాద్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో గబ్బర్ సింగ్ కాంబో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Updated Date - Feb 04 , 2026 | 05:19 PM