పవర్ స్టార్ బాక్సాఫీస్ మేనియా.. 'ఉస్తాద్' బిజినెస్ లెక్కలు ఇవే!

ABN , Publish Date - Feb 26 , 2026 | 12:38 PM

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ (Pawan Kalyan) అనే పేరు ఒక బ్రాండ్. గతేడాది విడుదలైన 'ఓజీ'  చిత్రంతో ప్రాంతీయ భాషలోనే 300 కోట్ల క్లబ్‌లో చేరి తన సత్తా చాటారు పవన్ కళ్యాణ్.

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ (Pawan Kalyan) అనే పేరు ఒక బ్రాండ్. గతేడాది విడుదలైన 'ఓజీ'  చిత్రంతో ప్రాంతీయ భాషలోనే 300 కోట్ల క్లబ్‌లో చేరి తన సత్తా చాటారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అదే ఊపుతో, తన మాస్ ఇమేజ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లడానికి 'ఉస్తాద్ భగత్ సింగ్‌' (Ustaad Bhagat Singh)
గా రాబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దాదాపు 14 ఏళ్లకు పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ (harish Shnakar) కాంబో సెట్ అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను విజువల్ వండర్‌లా తీర్చిదిద్దుతున్నారు. సమ్మర్ కానుకగా మార్చి 26న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది. వేసవి సెలవులను క్యాష్ చేసుకునేలా మేకర్స్ పక్కా ప్లానింగ్‌తో ఉన్నారు. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండటం, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం తోడవ్వడంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక బిజినెస్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఫిలిం నగర్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. 'ఓజీ' సృష్టించిన ప్రభంజనం వల్ల ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ రికార్డు ధరలకు అమ్ముడయ్యాయి. అయితే, థియేట్రికల్ బిజినెస్ దగ్గరకు వచ్చేసరికి కొన్ని చోట్ల మిక్స్‌డ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. ముఖ్యంగా నైజాం, సీడెడ్ ఏరియాల్లో బయ్యర్లు భారీ రేట్లు చెల్లించడానికి కొంచెం వెనకాడుతున్నట్లు టాక్. దీనికి ప్రధాన కారణం ఈ చిత్రం విజయ్ నటించిన 'తేరి'కి రీమేక్ అనే ప్రచారం బలంగా ఉండటమే. ఈ క్రమంలోనే కొన్ని ఏరియాల్లో ఇంకా డీల్స్ ఫైనల్ కాలేదని సమాచారం.

అయితే దర్శకుడు హరీష్ శంకర్ ఈ విమర్శలను చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఇది కేవలం రీమేక్ మాత్రమే కాదు, కథలో మేజర్ మార్పులు చేసి ఒక కొత్త కోణంలో ఉస్తాద్‌ ను ప్రజెంట్ చేస్తున్నట్లు ఆయన గతంలోనే క్లారిటీ ఇచ్చారు. గతంలో 'దేఖ్ లేంగే సాలా' సాంగ్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించగా, రీసెంట్‌గా వచ్చిన 'ఆరా ఆఫ్ ఉస్తాద్' అంతగా క్లిక్ కాలేదు. దీంతో ప్రమోషన్స్ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు రూట్ మారుస్తున్నారు. త్వరలో రాబోయే థర్డ్‌ సింగిల్ తో పాటు, ట్రైలర్ పైనే అందరి కళ్లు ఉన్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాకు ఒక్క పవర్ ఫుల్ ట్రైలర్ పడితే చాలు, బిజినెస్ లెక్కలన్నీ తలకిందులైపోతాయి. మైత్రీ మూవీ మేకర్స్ కూడా అదే నమ్మకంతో ఉన్నారు. మార్చి 26న రాబోయే ఈ ఉస్తాద్, బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను తుడిచిపెట్టేస్తుందా? లేదా అనేది చూడాలి. ట్రైలర్ తోనే ఈ సినిమా రేంజ్ ఏంటో తేలిపోయే అవకాశం ఉంది.

Updated Date - Feb 26 , 2026 | 12:47 PM