Kotha Malupu: కథలో.. ఊహించని మలుపులు
ABN , Publish Date - Jun 09 , 2026 | 09:57 AM
‘కొత్తమలుపు’ చిత్రం టైటిల్‌కు తగ్గట్లుగానే ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ఊహించని మలుపులతో ఉంటుంది’ అని అన్నారు నేపథ్యగాయని సునీత తనయుడు ఆకాశ్ గోపరాజు.
‘కొత్తమలుపు’ (Kotha Malupu) చిత్రం టైటిల్‌కు తగ్గట్లుగానే ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ఊహించని మలుపులతో ఉంటుంది’ అని అన్నారు నేపథ్యగాయని సునీత (singer sunitha) తనయుడు ఆకాశ్ గోపరాజు (Akash Goparaju). ‘సర్కారు నౌకరి’తో తెరంగేట్రం చేసిన ఆయన నటించిన రెండో చిత్రం ‘కొత్తమలుపు’. శివప్రసాద్ కేశవకుర్తి దర్శకత్వంలో తాటి బాలకృష్ణ నిర్మించారు. ఈనెల 12న సినిమా విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు ఆకాశ్.
‘కొత్తమలుపు’ కోనసీమ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ. ఇందులోని సస్పెన్స్ ప్రేక్షకులను థియేటర్లలో చూపుతిప్పుకోనివ్వకుండా చేస్తుంది. ఈ సినిమాలో నా పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. నేటి తరం వారిని ప్రతిబింబిస్తుంది. హీరోయిన్ భైరవి నాకు మరదలి పాత్రలో కనిపిస్తుంది. మా జోడీ చూడముచ్చటగా ఉందని డైరెక్టర్ శివప్రసాద్ ప్రశంసించారు.
సినిమాను మా అమ్మ సునీత ఇప్పటికే చూసి బాగుందని మెచ్చుకున్నారు. రఘుబాబు, పృథ్వీరాజ్, ప్రభావతి వంటి సీనియర్ నటులు పోషించిన పాత్రలు కథలో కీలకం. యశ్వంత్ నాగ్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు.