తిమ్మ‌రాజుప‌ల్లి టీవీ.. వీడియో సాంగ్

ABN , Publish Date - Feb 15 , 2026 | 07:42 PM

హీరో కిరణ్ అబ్బవరం నిర్మాత‌గా మారి ఫ‌స్ట్‌ టైం నిర్మిస్తోన్న చిత్రం తిమ్మ‌రాజుప‌ల్లి టీవీ.

Thimmaraju Palli TV

హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నిర్మాత‌గా మారి ఫ‌స్ట్‌ టైం నిర్మిస్తోన్న చిత్రం తిమ్మ‌రాజుప‌ల్లి టీవీ (Thimmarajupalli TV). సాయి తేజ్ (Sai Tej Pulula), వేదశ్రీ (Vedha) హీరో హీరోయిన్స్‌గా పరిచయం అవుతున్నారు. మునిరాజు ( Muniraju) దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోంది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన గ్లిమ్స్‌, పాట‌లు మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకున్నాయి.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఆదివారం చూడూ చూడే చిత్త‌రాలు.. న‌ట్టింటికి వ‌చ్చే సినిమా హాలు.. చూడు చూడు సీరియ‌ల్స్‌.. అంటూ సాగే హుషారైన మెలోడీ వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. సనారే (Sanare) సాహిత్యం అందించిన ఈ గీతాన్ని వంశీకాంత్ రేఖన (Vamsikanth Rekhana) సంగీతంలో స్వ‌రాగ్ కీర్త‌న్ (Swaraag Keerthan) ఆల‌పించారు. ఓ ఊరిలో ఓ కుటుంబం కొత్త‌గా టీవీ తీసుకు రావ‌డం దానిని చూడ‌డానికి జ‌నం ఎగ‌బ‌డ‌డం ఆపై జ‌రిగే ప‌రిణామాలు ఈ పాట‌లో హృద్యంగా తెర‌కెక్కించారు. అయితే.. గాయ‌కుడు స్వ‌రాగ్ కీర్త‌న్‌ స్వ‌రం చాలా సంద‌ర్భాల్లో శంక‌ర్ మ‌హాదేవ‌న్‌ను గుర్తు చేసింది. ఆయనే ఈ పాట పాడాడా అన్న‌ట్లుగా ఉంది.

Updated Date - Feb 16 , 2026 | 11:18 AM