Trisha: త్రిష.. హారతి అందుకేనా..
ABN , Publish Date - May 04 , 2026 | 01:32 PM
సౌత్ అగ్ర కథానాయిక త్రిష ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. ఓ పక్క ఆమె చేస్తున్న వరుస చిత్రాలు, మరో పక్క టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంతో త్రిష పేరు ట్రెండింగ్‌లో ఉంది
సౌత్ అగ్ర కథానాయిక త్రిష (trisha) ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. ఓ పక్క ఆమె చేస్తున్న వరుస చిత్రాలు, మరో పక్క టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ (Vijay) ఎన్నికల ఫలితాల నేపథ్యంతో త్రిష పేరు ట్రెండింగ్‌లో ఉంది. దానికి తోడు త్రిష హారతి పళ్లెంతో ఉన్న ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హీరో విజయ్ మంచి జోరు చూపిస్తున్నారు. విజయం ఆయనదేనంటూ అభిమానులు దీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్రిష హారతి పళ్లెంతో ట్రెడిషనల్‌గా కనిపిస్తూ ఓ ఫొటో బయటకు రావడంతో ‘విజయంతో రాబోతున్న విజయ్‌కు హారతి ఇవ్వడానికి త్రిష రెడీ’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఆ ఫొటో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రంలోనిది. ఇందులో త్రిష అవని పాత్ర పోషిస్తున్నారు. సోమవారం త్రిష పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర చిత్రంలోని ఆమె లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘మీరు విశ్వంభర’ చిత్రంలో నటించడం వల్ల ఈ ప్రాజెక్ట్ మరింత ప్రత్యేకంగా మారింది. మెగా మాస్ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ ఉండాలి’ అని దర్శకుడు ట్వీట్ చేశారు. ఇది కాకుండా త్రిష తమిళంలో సూర్య సరసన ‘కరుప్పు’ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో ‘వీరభద్రుడు’ టైటిల్‌తో విడుదల కానుంది. ఈ సినిమా నుంచి కూడా త్రిష లుక్‌ను విడుదల చేశారు. ఆర్‌జే బాలాజీ ఈ చిత్రానికి దర్శకుడు.