తమ్ముడు మృతి.. పారాక్వాట్ గడ్డి మందే కారణం
ABN , Publish Date - Mar 27 , 2026 | 09:39 PM
నటుడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు మృతి చెందారు.
నటుడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు మృతి చెందారు. పారాక్వాట్ అనే విషపూరిత గడ్డి మందు కారణంగా ఆయన మృతి చెందినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 'పారాక్వాట్ రసాయనం అత్యంత ప్రాణాంతకమైనది. దీనిని బలవన్మరణాల కోసం విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారు. ప్రతీ చోటా ఎంత సులభంగా లభిస్తుందో చూసి దిగ్భ్రాంతి చెందాను. ఈ రసాయనం వల్ల సంభవించే మరణాల సంఖ్య చూసి డాక్టర్స్ కూడా షాక్ అవుతున్నారు. దయచేసి దీన్ని వీలైనంత త్వరగా దీనిని నిషేధించండి. ప్రాణాలను కాపాడండి.' అంటూ తెలంగాణ సీఎం కార్యాలయానికి, పీఎం కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు.
ఈ రసాయనాన్ని రైతులు కలుపు మొక్కలు తొలగించేందుకు ఉపయోగిస్తారు. ఇది అత్యంత విషపూరితమైనది కాబట్టే కొన్ని రాష్ట్రాలు దీని అమ్మకాలపై పరిమితులు విధించాయి. చాలా దేశాలు బ్యాన్ చేశాయి. చిన్న పరిణామం కూడా చాలా ప్రమాదమని... ఎంతో ఎఫెక్ట్ చూపిస్తుందని వైద్యులు హెచ్చరించడంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అమ్మకాలపై పరిమితులు విధించింది. కొన్ని రాష్ట్రాలు కఠిన షరతులతో మాత్రమే వినియోగించేందుకు అనుమతి ఇస్తున్నాయి.