'టాక్సిక్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తొక్కిసలాట

ABN , Publish Date - Aug 23 , 2026 | 06:45 AM

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తొక్కిసలాట జరిగింది.

Malla Reddy toxic

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి పరిధిలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో (Malla Reddy University) శనివారం రాత్రి నిర్వహించిన టాక్సిక్ (Toxic) సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. హీరో యశ్ (Yash), ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమానికి విద్యార్థులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

హీరో యశ్ వేదికపై మాట్లాడుతుండగా ఆయనను చూసేందుకు విద్యార్థులు ఒక్కసారిగా అరుపులు, కేకలతో ముందుకు చొచ్చుకువచ్చారు. దీంతో అక్కడ స్వల్ప తొక్కిసలాట ఏర్పడింది. జనసందోహ ఒత్తిడి తట్టుకోలేక ప్రాంగణంలోని ఫ్లడ్ లైట్ స్తంభంతో పాటు భారీ స్పీకర్ బాక్సులు కిందపడిపోయాయి.

ఈ ఘటనలో పలువురు విద్యార్థుల కాళ్లు, చేతులకు గాయాలవ్వగా, ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే అంబులెన్స్లో చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఊహించని ప్రమాదంతో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్రాంగణంలో కొంతసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Updated Date - Aug 23 , 2026 | 07:07 AM