Dil Raju: టాక్సిక్.. నష్టమొచ్చినా పోయేదేమీ లేదు.. తెలివైన ఆట..
ABN , Publish Date - Aug 27 , 2026 | 11:51 AM
రాకింగ్ స్టార్ యశ్ (Yash) హీరోగా గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ‘టాక్సిక్’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఈ సినిమా బిజినెస్‌పై ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి.
రాకింగ్ స్టార్ యశ్ (Yash) హీరోగా గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ‘టాక్సిక్’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఈ సినిమా బిజినెస్‌పై ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. టాక్సిక్ తెలుగు హక్కుల్ని దిల్ రాజు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన రిటర్నబుల్ బేసిస్‌పై ఈ సినిమా హక్కుల్ని సొంతం చేసుకున్నారట. ‘టాక్సిక్’ (Toxic) సినిమాకు నెగటివ్ టాక్ రావడంతో దిల్‌రాజుకు భారీగా నష్టం వాటిల్లుతోందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నష్టం అనే విషయంలో దిల్‌రాజుకు ఎలాంటి భయం లేదని, సినిమా సక్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా తెలివిగా సినిమా హక్కులు ఒప్పందం చేసుకున్నారని మరో టాక్ నడుస్తోంది. సినిమా నష్టం తెచ్చినా దిల్ రాజుకు అన్ని రకాల ప్రయోజనాలు కలిగేలా ఒప్పందాలు చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. (Dil Raju Deal)
ఈ సినిమా తెలుగు రైట్స్‌ను రూ.108 కోట్లకు తీసుకున్నట్లు తొలుత ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఈ మొత్తాన్ని రూ.80 కోట్లకు కుదించినట్లు మాట్లాడుకున్నారు. చివరి క్షణంలో బయ్యర్లు రూ.75 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఇందులో ఆంధ్రా నుంచి రూ.35 కోట్లు, సీడెడ్ నుంచి రూ.10 కోట్లు, తెలంగాణ నుంచి మరో రూ.30 కోట్లు వచ్చినట్లు టాక్. కేవీఎన్ ప్రొడక్షన్స్ వాటా సగానికి కూడా తక్కువగా ఉండగా, మిగిలిన మెజారిటీ వాటా హీరో యశ్‌దేనట. ఈ నేపథ్యంలోనే సినిమా వసూళ్లలో తేడా జరిగితే 45 రోజుల్లో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేలా యశ్ అగ్రిమెంట్ చేశారట. దీంతో దిల్ రాజుతోపాటు ఇతర బయ్యర్లు కూడా ధైర్యంగా ఈ సినిమా బిజినెస్‌లోకి దిగినట్లు ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక్కడ మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. దిల్ రాజు నిర్మాణంలో యశ్ ఓ సినిమా చేయడానికి ఇప్పటికే కమిట్‌మెంట్ ఇచ్చారట. టాక్సిక్’ బిజినెస్‌లో ఏదన్నా లోటు వచ్చి దానిని యశ్ భర్తీ చేయాల్సిన పరిస్థితి వస్తే.. ఆ మొత్తాన్ని దిల్ రాజుతో యశ్ చేయబోయే సినిమాకు అడ్వాన్స్‌గా ఇచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే.. టాక్సిక్ రిజల్ట్ ఎలా ఉన్నా దిల్ రాజుకు వచ్చే నష్టం ఏమీ లేదని తెలుస్తోంది. అంతే కాదు.. దిల్ రాజుకు మరో కమిట్‌మెంట్ కూడా ఉందట. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమా రాబోయే సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలో ఈ సినిమా నైజాం రైట్స్‌ను దిల్ రాజుకు ఇచ్చేందుకు కేవీఎన్ హామీ ఇచ్చారట. సినిమా బాగా ఆడితే లాభాలు, నష్టమొస్తే 45 రోజుల్లో రికవరీ, యశ్‌తో ఓ సినిమా, అలాగే ‘కాకా’ సినిమా నైజాం హక్కులు.. ఎలా చూసినా దిల్ రాజుకు ప్రయోజనమే కానీ.. ఏ రకంగానూ నష్టం లేదని, అలా దిల్ రాజు డీల్ కుదుర్చుకుని తెలివైన ఆట ఆడారని టాక్ నడుస్తోంది.