టొవినో థామస్: ఒక్క సినిమాకు ఏడాది టైమ్ ఇవ్వలేను..
ABN , Publish Date - Mar 31 , 2026 | 05:41 PM
ఎన్టీఆర్(NTR), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! డ్రాగన్ (Dragon) వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో టొవినో థామస్ నటించాల్సింది. కానీ ఆయన ఇప్పుడీ ప్రాజెక్ట్‌లో లేరు.
ఎన్టీఆర్(NTR), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! డ్రాగన్ (Dragon) వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీని కోసం ఎన్టీఆర్ స్టైలిష్ లుక్‌లో తయారయ్యారు. అయితే ఈ చితంలో మలయాళ నటుడు టొవినో థామస్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు.
డేట్స్ సమస్య వల్ల తాను ఈ చిత్రంలో నటించడం లేదని వెల్లడించారు. అలాగే తెలుగు సినిమాల చిత్రీకరణపై కూడా ఆయన స్పందించారు. ‘నేను ఒకేసారి వరుస సినిమాలు చేయను. మలయాళంలో ఓ సినిమాను ఓ షెడ్యూల్‌లో పూర్తి చేస్తాం. కానీ తెలుగులో ఒక సినిమా పూర్తి చేయడానికి దాదాపు సంవత్సరం పడుతుంది. అందుకే తెలుగులో సినిమాలు చేయడం లేదు. ఓ సినిమాకు మూడు నెలలు మాత్రమే కమిట్ అవ్వగలను. ఏడాది కేటాయించలేను’ అని అన్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘పళ్ళి చట్టంబి’ చిత్రం తెలుగులో ఏప్రిల్ 10న విడుదల కానుంది.