కొత్త ట్రెండ్.. డైరెక్టర్స్ కి డెడ్ లైన్స్
ABN , Publish Date - Oct 11 , 2026 | 04:39 PM
ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ట్రెండ్స్ మారుతూ ఉంటుంది. సరికొత్త ట్రెండ్స్ వస్తూ ఉంటాయి. తాజాగా టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలయ్యింది. అదేంటంటే.. టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు కథలు, ప్రాజెక్ట్‌ల విషయంలో మరింత పక్కాగా వ్యవహరిస్తున్నారు.
ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ట్రెండ్స్ మారుతూ ఉంటుంది. సరికొత్త ట్రెండ్స్ వస్తూ ఉంటాయి. తాజాగా టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలయ్యింది. అదేంటంటే.. టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు కథలు, ప్రాజెక్ట్‌ల విషయంలో మరింత పక్కాగా వ్యవహరిస్తున్నారు. ఒక సినిమాతో వచ్చిన క్రేజ్‌ను కంటిన్యూ చేస్తూ, తదుపరి సినిమాల విషయంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా దర్శకులకు స్ట్రిక్ట్ డెడ్ లైన్లు విధిస్తున్నారు. బౌండెడ్ స్క్రిప్ట్‌తో కరెక్ట్ టైమ్‌కి వస్తేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు, లేదంటే వేరే ప్రాజెక్ట్‌ల వైపు అడుగులు వేస్తున్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో రాకా మూవీతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా చివరి దశకు చేరుకున్న తరుణంలో, తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఆయన ఇప్పుడే ఫోకస్ పెంచాడు. ఇప్పటికే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో బన్నీ ఒక సినిమాని అధికారికంగా అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. అయితే ఈ మధ్య ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. లోకేష్.. బన్నీ చెప్పిన కథ వేరు, రాసుకున్న కథ వేరు అంట. అది చూసి బన్నీ ఆయన రాసిన కథను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. బన్నీకి చెప్పిన లైన్ ని డెవలప్ చేసి ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తీసుకురావాలని, దానికోసం లోకేష్ కి 3 నెలలు డెడ్ లైన్ పెట్టినట్లు టాక్. 90 రోజుల్లోపు స్క్రిప్ట్ లాక్ చేసి ఇస్తేనే ముందుకు వెళ్తామని, లేదంటే వేరే దర్శకుడికి ఛాన్స్ ఇస్తానని బన్నీ అన్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా.. శ్రీకాంత్ ఓదెలకి డెడ్ లైన్ పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాకా సినిమాను 2027 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత శ్రీకాంత్ ఓదెలతో చేయాల్సిన ప్రాజెక్ట్‌తో పాటు, ఫిబ్రవరిలో మరో కొత్త సినిమాను పట్టాలెక్కించేందుకు ఆయన కసరత్తు చేస్తున్నారు. ఎక్కడా సమయం వృథా కాకుండా, కథల విషయంలో దర్శకులకు ముందే స్పష్టతనిస్తూ మెగాస్టార్ వేగంగా అడుగులు వేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల కి కూడా చిరు డెడ్ లైన్ పెట్టారట. ఆ సమయం అయిపోతే.. ఈ సినిమా ఆగిపోయినట్టే అని సమాచారం. టాలీవుడ్‌లో ఇప్పుడు స్టార్ హీరోలందరూ ఇదే బాటలో ప్లానింగ్ చేసుకుంటుండటం విశేషం. ఏళ్లు ఏళ్లు కథల కోసం ఆగకుండా ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ కోసం డైరెక్టర్స్ కి డెడ్ లైన్స్ పెట్టడం మంచి విషయమే అని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.