పెళ్లి చేసుకుని.. సడన్ షాకిచ్చిన నాని హీరోయిన్! ఫొటోలు వైరల్
ABN , Publish Date - Apr 26 , 2026 | 10:02 PM
ప్రముఖ హీరోయిన్ మెహారీన్ పిర్జాదా సడన్‌గా పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చింది.
ప్రముఖ హీరోయిన్ మెహారీన్ పిర్జాదా (Mehreen Pirzada) సడన్‌గా పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చింది. నాని కృష్ణగాడి వీర ప్రేమ గాథ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఆ పై శర్వానంద్ మహానుభావుడు, ఎఫ్1. ఎఫ్2, పంతం, రాజా ది గ్రేట్ చిత్రాలతో అనతి కాలంలోనే మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.
అయితే కెరీర్ మంచి పీక్‌లో ఉన్న సమయంలోనే పెళ్లి అంటూ ఓ పొలీటీషియన్‌తో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుని వార్తల్లో నిలిచింది ఈ పంజాబీ చిన్నది. ఏమైందో ఏమో రెండు మూడు రోజుల్లోనే అది కాస్త ఫెయిల్ అవడం తిరిగి సినిమాల్లో బిజీ కావడం చకచక జరిగిపోయాయి.
కానీ సెకండ్ ఎంట్రీలో అశించినంతగా పెద్ద బ్యానర్ల నుంచి సినిమా ఛాన్సులు రాక పోవడంతో అడపా దడపా చిన్న సినిమాల్లోనూ నటించింది. చివరగా 2023లో స్పార్క్ అనే తెలుగు సినిమా చేసింది. ఇప్పుడు కన్నడలో ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం విడుదల కావాల్సి ఉంది.
ఇది ఇలా ఉండగానే సడన్‌గా పంజాబ్‌కు చెందిన వ్యాపారవేత్త అర్ష్ ఔలఖ్ (Arsh Aulakh) ను పంజాబీ ఆచారంలో పెళ్లి చేసుకుని ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో మెహరీన్ పంచుకోగా ఫ్యాన్స్ ఆశ్చర్య పోయారు. ఇప్పుడు ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. సినామా సెలబ్రిటీలు, అభిమానులు మెహరీన్‌కు అల్ ది బెస్ట్ చెబుతున్నారు.