ఛత్రపతి విలన్ పై కేసు నమోదు.. నడిరోడ్డుపై కాలితో తన్నుతూ..

ABN , Publish Date - Jun 08 , 2026 | 03:53 PM

టాలీవుడ్ సీనియర్ నటుడు, ఛత్రపతి ఫేమ్ సుప్రీత్ (Supreeth Reddy) పై హైదరాబాద్‌లోని మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.

Supreeth reddy

టాలీవుడ్ సీనియర్ నటుడు, ఛత్రపతి ఫేమ్ సుప్రీత్ (Supreeth Reddy) పై హైదరాబాద్‌లోని మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ క్యాబ్ డ్రైవర్‌ను ఆయన తీవ్రంగా దూషించడమే కాకుండా, చితకబాదాడనే ఆరోపణలు రావడంతో ఈ ఘటన ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ గొడవ జరగడంతో స్థానికంగా కాసేపు తీవ్ర కలకలం రేగింది.


బాధితుడు మరియు పోలీసుల కథనం ప్రకారం... నాగారం చౌరస్తాలో తాను ట్రిప్ పూర్తిచేసుకొని ఒక పక్కగా కారును ఆపానని మరో బుకింగ్ కోసం ఎదురుచూస్తున్నానని .. అప్పుడే సుప్రీత్ ప్రయాణిస్తున్న కారు, ఒక క్యాబ్ ఎదురుగా వచ్చిందని.. ఆ సమయంలో సైడ్ ఇచ్చే విషయంలో ఇరువైపులా చిన్నపాటి వాగ్వాదం మొదలైందని తెలిపాడు. ఆ వాగ్వాదంలో మాట మాట పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన నటుడు సుప్రీత్, కారు దిగి వచ్చి క్యాబ్ డ్రైవర్‌పై ఒక్కసారిగా దాడికి దిగాడట. డ్రైవర్ అని కూడా చూడకుండా రోడ్డుపైనే అతడిని కాలితో తన్నుతూ, పిడిగుద్దులు కురిపించినట్లు బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.


వెంటనే క్యాబ్ డ్రైవర్ సుప్రీత్ రౌడీయిజంపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సుప్రీత్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలో ఎంతమాత్రం విలన్ గా చేస్తుంటే బయట కూడా విలన్ అనుకుంటున్నాడా.. ? ఇలాంటివారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Updated Date - Jun 08 , 2026 | 04:03 PM