‘ఫౌజీ’ నుంచి పవర్‌ఫుల్ అప్‌డేట్.. టీజర్ టైమ్ ఫిక్స్?

ABN , Publish Date - Sep 25 , 2026 | 11:51 AM

ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఫౌజీ’ గురించి తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Prabhas

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (​Prabhas), ఫీల్ గుడ్ అండ్ యాక్షన్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఫౌజీ (Fauji). ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే ట్రేడ్ వర్గాలతో పాటు సినీ అభిమానుల్లో ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ సరసన అందాల భామ ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సోషల్ మీడియాను షేక్ చేయడమే కాకుండా, సినిమాపై ఉన్న అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. ఇక ఈ మూవీని మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా భారీ కాస్టింగ్‌తో ప్లాన్ చేశారు. సీనియర్ నటులు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భానుచందర్, జయప్రద వంటి దిగ్గజాలు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తుండటంతో సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.

అయితే, మొదట్లో ఈ చిత్రాన్ని డిసెంబర్ 3వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనూహ్యంగా ఈ చిత్రం వాయిదా పడింది. ఇటీవల ఓ ఈవెంట్‌లో పాల్గొన్న నిర్మాత యలమంచిలి రవిశంకర్.. ఫౌజీ మూవీ అనుకున్న సమయానికి రావడం లేదని స్పష్టం చేయడంతో డార్లింగ్ అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. రిలీజ్ డేట్ వాయిదా పడి నిరాశలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 'ఫౌజీ' మూవీ నుంచి ఒక మాస్ అప్‌డేట్ ఇవ్వబోతున్నారట. ప్రభాస్ బర్త్ డే కానుకగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ టీజర్‌కు "వరల్డ్ ఆఫ్ ఫౌజీ" అనే పవర్‌ఫుల్ పేరును కూడా మేకర్స్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై మైత్రీ మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం, రిలీజ్ వాయిదాతో డల్ అయిన అభిమానులకు ఇది పూనకాలు తెప్పించే వార్త అని చెప్పవచ్చు.

ఇక 'ఫౌజీ' షూటింగ్ విషయానికి వస్తే.. సినిమాను విజువల్ వండర్‌గా మలిచేందుకు టీమ్ రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ అక్టోబర్ 20వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉందని సమాచారం. ఆ తర్వాత మరో 10 రోజుల పాటు టాకీ పార్ట్, అలాగే ప్రభాస్‌పై ఒక బ్యూటిఫుల్ మాంటేజ్ సాంగ్ చిత్రీకరణ జరపనున్నారట. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ప్రేక్షకులకు బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసం, ఇంతకుముందే షూటింగ్ చేసిన ఒక యాక్షన్ సీన్‌ను కొత్త ఫైట్ మాస్టర్లతో తిరిగి రీ-షూట్ చేస్తున్నారట. సినిమాను అత్యుత్తమ క్వాలిటీతో తీర్చిదిద్దడానికే చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకుందట. ఇక నవంబర్ చివరి నాటికి 'ఫౌజీ' షూటింగ్‌ను పూర్తి చేయాలని మేకర్స్ టార్గెట్‌గా పెట్టుకున్నారు.

నవంబర్‌లో షూటింగ్ పూర్తయితే, 'ఫౌజీ' ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న. ప్రచారంలో ఉన్న టాక్ ప్రకారం.. వచ్చే ఏడాది మార్చి 5న 'ఫౌజీ'ని విడుదల చేయడానికి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. వచ్చే ఏడాది మార్చి 5న సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబోలో వస్తున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ విడుదల కానుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ వర్సెస్ ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడలేరు కాబట్టి, ఫౌజీ కోసం ‘స్పిరిట్’ సినిమాను లేదా స్పిరిట్ కోసం ఫౌజీని వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ రెండింటిలో ఏది ముందు వస్తుంది? ఫౌజీ ఏ తేదీన థియేటర్లలో అడుగుపెడుతుందనేది తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక స్పష్టత వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

Updated Date - Sep 25 , 2026 | 12:13 PM