Mr. Work From Home: త్రిగుణ్.. మరో డిఫరెంట్ కాన్సెప్ట్! మిస్టర్ వర్క్ ఫ్రం హోం టీజర్ అదిరింది
ABN , Publish Date - Jan 04 , 2026 | 05:27 PM
ఇటీవల ఈషా సినిమాతో మంచి విజయం అందుకున్న త్రిగుణ్ (Thrigun) మరో డిఫరెంట్, ఫీల్ గుడ్ కాన్సెప్ట్‌తో అలరించేందుకు సిద్ధమయ్యాడు.
ఇటీవల ఈషా సినిమాతో మంచి విజయం అందుకున్న త్రిగుణ్ (Thrigun) మరో డిఫరెంట్, ఫీల్ గుడ్ కాన్సెప్ట్‌తో అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఆయన హీరోగా, పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna) జంటగా నటించిన కొత్త చిత్రం మిస్టర్ వర్క్ ఫ్రం హోం (Mr. WORK FROM HOME). మణుదీప్ చెలికాని (Madhudeep Chelikaani) దర్శకత్వం వహించాడు. శివాజీ రాజా, అనీష్ కురివిల్లా కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఆదివారం ఈ చిత్రం టీజర్ విడుదల చేశారు.
టీజర్ చూస్తుంటే.. చాలా మంచి కాన్పెస్ట్, ఈ సమయంలో అందరికి చెప్పాల్సిన సబ్జెక్ట్‌ను కథా వస్తువుగా తీసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఉన్నత చదువులు చదివిన వారు చాలామంది సిటీలు, దేశాల్లో సెటిల్ అవవుతుంటే అందుకు విరుద్ధంగా హీరో తన సొంత ఊర్లో వ్యవసాయం చేసే కథతో మంచి మేసేజ్ ఇస్తూ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి.