మహానటి.. ఎవరికి జోడీ
ABN , Publish Date - Mar 06 , 2026 | 06:30 PM
విక్టరీ వెంకటేష్ (Venkatesh) - అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో వచ్చిన ప్రతి సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
విక్టరీ వెంకటేష్ (Venkatesh) - అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో వచ్చిన ప్రతి సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్ గారు సినిమాలతో అలరించిన వెంకీ అనిల్ కాంబో ఐదోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. వెంకీఅనిల్ 5 అనే పేరుతో ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇక ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ మరో హీరోగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి.. పటాస్ లాంటి సినిమాతో కళ్యాణ్ రామ్ కి మంచి హిట్ ఇచ్చారు. అది అనిల్ మొదటి సినిమా కావడం విశేషం. ఇక మరోసారి తన మొదటి సినిమా హీరోతో కలిసి పనిచేయడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రంలో ఇద్దరు హీరోల కోసం అనిల్.. స్టార్ హీరోయిన్స్ ను వెతికే పనిలో పడ్డారట. తాజాగా ఒక హీరోయిన్ గా మహానటి కీర్తి సురేష్ ను ఎంపిక చేసినట్లు సమాచారం.
అయితే కీర్తి.. ఎవరికి జోడీ అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. వెంకీ మామకా ..? కళ్యాణ్ రామ్ కా అనేది సెకండ్ హీరోయిన్ ని ఎంపిక చేశాకే తెలుస్తోంది. కొందరు మాత్రం వెంకీ సరసనే కీర్తి నటిస్తోంది అని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కీర్తి సినిమాలు చేస్తున్నారు కానీ, విజయాలను అందుకోలేకపోతున్నారు. మరి అనిల్ రావిపూడి .. మహానటికి విజయాన్ని అందిస్తారేమో చూడాలి.