Mega 158: మెగాస్టార్ తో ఐశ్వర్య రాయ్ రొమాన్స్..

ABN , Publish Date - Jan 07 , 2026 | 08:54 PM

సెట్స్ పైకి వెళ్లక ముందే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మూవీ సెన్సేషన్ గా మారింది. హిట్ కాంబోనే పెద్ద ప్లస్ అనుకుంటే.. అంతకు మించిన ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి.

Mega 158

Mega 158: సెట్స్ పైకి వెళ్లక ముందే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మూవీ సెన్సేషన్ గా మారింది. హిట్ కాంబోనే పెద్ద ప్లస్ అనుకుంటే.. అంతకు మించిన ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఒక్కో విషయం బయటపడుతుండటంతో అభిమానుల్లోనూ అంచనాలు పెరిగిపోతున్నాయి. 'మన శంకర వరప్రసాద్ గారు' సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. సమ్మర్ లో విశ్వంభర సైతం థియేటర్లలోకి రానుంది. దీంతో నెక్ట్స్ ప్రాజెక్టులపై మెగాస్టార్ చిరంజీవి ఫోకస్ పెట్టాడు.

చిరు, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో రానున్న 'మెగా 158'పై టాలీవుడ్ జోరుగా చర్చలు జరుగుతున్నాయి. రస్టిక్ మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు చర్చల్లోకి వస్తున్నాయి. దీంతో మూవీ సెట్స్ పైకి వెళ్లకముందే అభిమానులు ఎక్సైట్‌మెంట్‌లో మునిగిపోతున్నారుKVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న మెగాస్టార్, బాబీ మూవీ ఫిబ్రవరి 2026 నుంచి షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇంటర్నల్ సోర్సెస్ ప్రకారం.. ఈ మూవీలో చిరు తండ్రి పాత్రలో కనిపిస్తారని.. కథలో బలమైన ఎమోషన్‌తో పాటు కొత్త షేడ్స్ చూపిస్తారని బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే కాన్సెప్ట్ పోస్టర్ మాస్ హైప్ క్రియేట్ చేసింది. అంతేకాదు ఇతర క్యాస్టింగ్ విషయంలోనూ ఆసక్తికర కథనాలు వినబడుతున్నాయి.

మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ పవర్ ఫుల్ రోల్ లో నటించే అవకాశాలు ఉన్నాయని రూమర్లు వినిపిస్తున్నాయి. చిరు-ఐశ్వర్య జోడీ అనగానే ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. చిరంజీవి పక్కన ఐశ్వర్యరాయ్‌ని జోడీగా చూడాలని మెగా ఫ్యాన్స్‌ ఎప్పటి నుంచో కోరుకొంటున్నారు. ‘సైరా’లో ఆ ఛాన్స్‌ వస్తుందని ఆశించారు . కానీ కుదరలేదు. ఇప్పుడు బాబీ సినిమాలో ఆ కోరిక తీరేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఐష్‌తో సంప్రదింపులు మొదలెట్టినట్టు సమాచారం. ‘పొన్నియన్‌ సెల్వన్‌’ మంచి హిట్‌ అవ్వడంతో ఐష్‌ కూడా సౌత్‌ సినిమాలపై దృష్టి పెట్టిందట. వీరిద్దరూ పర్ఫెక్ట్ జోడీ అవుతుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.

మరోవైపు మళయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కూడా ముఖ్య పాత్రలో జాయిన్ అవుతారని కూడా టాక్ వినిపిస్తోంది. దీంతో ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు. మ్యూజిక్ డిపార్ట్‌మెంట్‌లో ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. మొత్తంగా మెగా 158లో స్టార్ కాస్ట్, టాప్ టెక్నీషియన్స్‌తో దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది.

Updated Date - Jan 07 , 2026 | 08:59 PM