దేవుడా.. కమెడియన్ సత్యకు ఇంత పెద్ద కూతురు ఉందా
ABN , Publish Date - May 01 , 2026 | 01:57 PM
టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు సత్య (Satya). అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టి నెమ్మదిగా సినిమాల్లో కమెడియన్ గా మారారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు సత్య (Satya). అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టి నెమ్మదిగా సినిమాల్లో కమెడియన్ గా మారారు. స్వామి రారా, ఛలో, మత్తు వదలరా, మత్తు వదలరా 2 సినిమాలు సత్యకు మంచి గుర్తింపును తీసుకొచ్చిపెట్టాయి. స్టార్ కమెడియన్ గా మారిన సత్యతో రితేష్ రానా.. జెట్లీ (Jetlee) అనే సినిమా తెరకెక్కించారు. మే 1 న రిలీజ్ అయిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ ను అందుకొంటుంది.
సత్య సినిమాల విషయం పక్కనపెడితే.. ఆయన ఫ్యామిలీ గురించి ఇండస్ట్రీలో చాలా తక్కువమందికి తెలుసు. ఇక ప్రేక్షకులకు అయితే అసలు సత్యకు పెళ్ళి అయ్యిందో లేదో కూడా తెలియదు. తాజాగా జెట్లీ ప్రమోషన్స్ లో సత్య తన కుటుంబం గురించి చెప్పారు. తనకు పెళ్ళి అయ్యిందని, 9 ఏళ్ళ కుమార్తె కూడా ఉందని చెప్పడంతో నెటిజన్స్ షాక్ అవుతున్నారు. సత్యకు అంత పెద్ద కూతురు ఉందా..? అని నోళ్ళు వెళ్ళబెడుతున్నారు.
ఇక తన కుమార్తె పేరు వెనుక కూడా పెద్ద కథ ఉందని సత్య తెలిపారు. తన కూతురు పేరు సుధీర అని, తనకు స్వామి రారా సినిమాతో ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేసిన డైరెక్టర్ సుధీర్ వర్మ మీద ఉన్న గౌరవంతో తన కూతురుకు సుధీర అని పేరు పెట్టినట్లు సత్య తెలిపారు. ప్రస్తుతం సత్య పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. జెట్లీలో హీరోగా నటించిన ఆయన.. తరువాత కూడా హీరోగా చేస్తారా .. ? లేదా కమెడియన్ గా కొనసాగుతారా అనేది తెలియాల్సి ఉంది.