వినూత్న కథాంశంతో ‘ది రెడ్ బ్యాగ్’

ABN , Publish Date - Apr 05 , 2026 | 07:50 PM

ఓ బ్యాగ్ చుట్టూ తిరిగే కథతో ‘ది రెడ్ బ్యాగ్’ (The Red Bag) అనే సినిమా తెరకెక్కుతోంది. రవి కుమార్ సీరపు (Ravi kumar) దర్శకత్వంలో హరికృష్ణ సోమిశెట్టి దీనిని నిర్మిస్తున్నారు.

ఓ బ్యాగ్ చుట్టూ తిరిగే కథతో ‘ది రెడ్ బ్యాగ్’ (The Red Bag) అనే సినిమా తెరకెక్కుతోంది. రవి కుమార్ సీరపు (Ravi kumar) దర్శకత్వంలో హరికృష్ణ సోమిశెట్టి దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను హీరో దినేష్ తేజ్, రైటర్, డైరెక్టర్ హరి ప్రసాద్ రిలీజ్ చేసి చిత్ర యూనిట్‌‌కు బెస్ట్ విషెస్ అందించారు. కబీర్ దుహన్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మౌనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత కాంప్రమైజ్ కాకుండా నిర్మించారని దర్శకుడు చెప్పారు. ఈ సినిమాకు శేఖర్ మోపురి సంగీతం అందించగా  విక్రమ్ రాజా రచన సహకారం అందించారు. ప్రియేష్ గురుసామి కెమెరామెన్‌గా, శివ శర్వాని, శశి ఎడిటర్‌గా పని చేశారు.  

Updated Date - Apr 06 , 2026 | 12:41 PM