బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో .. పెద్ది వస్తున్నాడు

ABN , Publish Date - May 15 , 2026 | 02:27 PM

ప్రస్తుతం టాలీవుడ్ జనం అందరి చూపు 'పెద్ది (Peddi)' వైపే సాగుతోంది. ఎందుకంటే సంక్రాంతి సినిమా సంబరాల తరువాత మళ్ళీ బిగ్ మూవీస్ ఏవీ జనం ముందుకు రాలేదు. వేసవి వెలవెల బోయింది. లేట్ గా 'పెద్ది' సమ్మర్ ఎండింగ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు.

Peddi

ప్రస్తుతం టాలీవుడ్ జనం అందరి చూపు 'పెద్ది (Peddi)' వైపే సాగుతోంది. ఎందుకంటే సంక్రాంతి సినిమా సంబరాల తరువాత మళ్ళీ బిగ్ మూవీస్ ఏవీ జనం ముందుకు రాలేదు. వేసవి వెలవెల బోయింది. లేట్ గా 'పెద్ది' సమ్మర్ ఎండింగ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. లేట్ గా వచ్చినా లేటెస్ట్ కిక్ ఇవ్వడానికి 'పెద్ది' సమాయమత్తమవుతున్నాడు. జూన్ 4వ తేదీన 'పెద్ది' గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే 'పెద్ది' నుండి కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. 'పెద్ది'లో శివరాజ్ కుమార్ పోషించిన గౌర్నాయుడు పాత్ర మూవీకే ఓ ఎస్సెట్ అని చెబుతున్నారు... శివరాజ్ కుమార్ గ్లింప్స్ చూశాక 'పెద్ది' డైరెక్టర్ ఈ సినిమాను ఎంత జాగ్రత్తగా తెరకెక్కించారో అర్థమవుతోంది.


'పెద్ది' చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. అందువల్ల తెలుగునేలపైనే కాదు, అటు నార్త్ ఇటు సౌత్ లోనూ 'పెద్ది' ప్రచార హోరు సాగనుంది. 'పెద్ది' సాధారణ చిత్రం కాదని, తుఫానులా వణికించేస్తుందని, ఇందులోని కథ మన మనసుల్ని తాకి, మనతోనే ఉంటుందని 'పెద్ది' టీమ్ అంటోంది. ఇంతలా ప్రచారం సాగిస్తోన్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మే 18న ముంబైలో జరగనుంది. తరువాత మే 22న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియమ్ లో ఫ్యాన్స్ ను పలకరించనుంది 'పెద్ది' టీమ్... ఆ రోజు ఉప్పల్ స్టేడియమ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ కు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మధ్య ఐపీయల్ మ్యాచ్ ఉంది. రెండూ క్రేజీ టీమ్స్ కాబట్టి ఉప్పల్ స్టేడియమ్ కిటకిటలాడుతుంది. అదే సమయంలో 'పెద్ది' టీమ్ కూడా సందడి సాగిస్తే ఆ రేంజ్ మరో లెవెల్ లో ఉంటుందని వేరే చెప్పాలా?... తరువాత 23న భోపాల్ లో, 24న బెంగళూరులో, 28న ఢిల్లీలో, 30న చెన్నైలో 'పెద్ది' హంగామా సాగనుంది... ఇక జూన్ 1వ తేదీన విజయనగరంలో, 2వ తేదీన మళ్ళీ హైదరాబాద్ లో 'పెద్ది' ఈవెంట్స్ జరగనున్నాయి.


'పెద్ది' సినిమాకు మొదటి ఎస్సెట్ హీరో రామ్ చరణ్ కాగా, దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాను తెరకెక్కించిన తీరు మరో ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది... ఈ చిత్రానికి ఎ.ఆర్.రహమాన్ సంగీతం ఇప్పటికే అభిమానులను చిందులు వేయిస్తోంది... ఇక అందాల తార జాన్వీ కపూర్ గ్లామర్ సైతం 'పెద్ది'ని యూత్ చెంతకు చేరుస్తుందని వినికిడి... స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన 'పెద్ది' చిత్రం అన్ని వర్గాల వారినీ ఆకట్టుకొనే అంశాలతో తెరకెక్కిందని తెలుస్తోంది . దాదాపు ఐదు నెలల తరువాత వస్తోన్న టాప్ స్టార్ మూవీ 'పెద్ది' కాబట్టి వసూళ్ళ వర్షాలు కురిసి తీరతాయని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. ఇక ఈ ప్రమోషన్స్ , గ్లింప్స్ లు చూసి మెగా ఫ్యాన్స్.. బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో.. పెద్ది వస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.

Updated Date - May 15 , 2026 | 02:30 PM