‘ది ప్యారడైజ్’ టీజర్‌కు డేట్ లాకైంది.. నిడివి ఎంతంటే!

ABN , Publish Date - Jul 31 , 2026 | 08:39 PM

నేచురల్ స్టార్ నాని హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న పాన్-వరల్డ్ చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీ టీజర్‌ విడుదలకు డేట్ లాక్ చేశారు.

The Paradise Movie Update

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న పాన్-వరల్డ్ చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise). ‘దసరా’ వంటి భారీ విజయం తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచీ భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు, టైటిల్ గ్లింప్స్ మాత్రమే కాకుండా, ఇటీవలే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ పాట కూడా ప్రపంచవ్యాప్తంగా రికార్డు వ్యూస్‌తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా ఇప్పుడు తన నెక్స్ట్ బిగ్ అప్‌డేట్‌తో సిద్ధమైంది.


సినీ ప్రియులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ‘ది ప్యారడైజ్’ అధికారిక టీజర్‌ (The Paradise Teaser)ను ఆగస్టు 6న విడుదల చేయనున్నట్లు మేకర్స్ శనివారం అధికారికంగా ప్రకటించారు. 1 నిమిషం 35 సెకన్ల నిడివితో (Run time) కట్ చేసిన ఈ టీజర్‌లో నాని ప్రెజెన్స్, సినిమా రా విజువల్ వరల్డ్, ఇంకా కథలోని పవర్‌ఫుల్ ఎమోషనల్ ఇంటెన్సిటీని గూస్‌బంప్స్ వచ్చేలా చూపించబోతున్నారని తెలుస్తోంది. నాని రగ్గడ్ అండ్ ఫియర్స్ మేకోవర్, శ్రీకాంత్ ఓదెల యూనిక్ టేకింగ్ ఇవన్నీ కలిసి టీజర్‌పై, అలాగే సినిమాపై ఉన్న అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాయని చెప్పొచ్చు.


ఈ విజువల్ వండర్‌కు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, సిహెచ్ సాయి సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, కయాదు లోహర్, రాఘవ్ జుయాల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వినూత్నంగా ప్లాన్ చేస్తున్న ఈ పాన్-వరల్డ్ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి:

అంజలీదేవి నుంచి సాయి పల్లవి వరకు.. వెండితెర సీతమ్మల జర్నీ!

బర్త్‌డే స్పెషల్.. ‘టాక్సిక్’ రాయల్ లుక్‌లో కియారా!

సీనియర్ నటి మంజు భార్గవితో NSR స్పెషల్ ఇంటర్వ్యూ

Updated Date - Jul 31 , 2026 | 08:39 PM