ప్యారడైజ్ సెకండ్ సింగిల్.. ఏం హైప్ రా బాబు

ABN , Publish Date - Aug 25 , 2026 | 07:28 PM

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం ది పారడైజ్ (The Paradise).

The Paradise

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం ది పారడైజ్ (The Paradise). దసరా వంటి ఊరమాస్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో మరియు అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎస్‌ఎల్‌వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాలో మోహన్ బాబు, కయాడు లోహర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా, కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్‌లో అలరించనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన మొదటి పాట ఆయా షేర్ యూట్యూబ్‌లో ఏ రేంజ్ సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ సోషల్ మీడియాని షేక్ చేశాయి.


తాజాగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాను షేక్ చేసే ఒక క్రేజీ పిక్‌ను మేకర్స్ విడుదల చేశారు. మ్యాజిక్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌ను ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్ ఆశీర్వదిస్తున్న ఫొటోను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పంచుకుంటూ, సినిమాలోని రెండో సింగిల్ (Second Single) రికార్డింగ్ పూర్తయిందని అధికారికంగా ప్రకటించాడు. 'మీ స్పీకర్లను సిద్ధం చేసుకోండి.. పాట త్వరలోనే రాబోతోంది' అని శ్రీకాంత్ పోస్ట్ చేయడంతో నాని అభిమానుల్లో ఉత్సాహం గీత దాటింది.


ఏం హైప్ ఇస్తున్నారు.. ఐటెమ్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారా అంటే అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు రాబోతున్న ఈ రెండో పాట ఒక సాలిడ్ మాస్ అండ్ ఎనర్జిటిక్ ఫోక్ సాంగ్‌గా ఉండబోతోందని సమాచారం. కాసర్ల శ్యామ్ అందించిన నాటు లిరిక్స్, దానికి అనిరుధ్ ఇచ్చిన మాస్ బీట్స్ తో కలిపి ఈ జానపదం చార్ట్‌బస్టర్‌గా నిలవడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది. అనిరుధ్ మ్యూజిక్ మానియా, శ్రీకాంత్ ఓదెల మాస్ విజన్ కలసి ది పారడైజ్ తో బాక్సాఫీస్ వద్ద మరోసారి రికార్డులు సృష్టిస్టారేమో చూడాలి.

Updated Date - Aug 25 , 2026 | 07:28 PM