The Paradise: అమెరికాలో.. హై ఎనర్జీ ఫోక్ మాస్ ఆంథమ్ రిలీజ్
ABN , Publish Date - Aug 27 , 2026 | 08:20 PM
నేచురల్ స్టార్ నాని, ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవేటెడ్ పాన్-వరల్డ్ చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదలకు అంతా సిద్ధమైంది.
నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవేటెడ్ పాన్-వరల్డ్ చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise). ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచగా, ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ చార్ట్‌బస్టర్‌గా నిలిచి శ్రోతలను ఉర్రూతలూగించింది. తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్‌ను మరింత వినూత్నంగా విడుదల చేసేందుకు మేకర్స్ సరికొత్త ప్లాన్ సిద్ధం చేశారు.
సంగీతంతో పాటు సరికొత్త పర్ఫార్మెన్స్‌లతో ట్రెండ్ సెట్ చేసే రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) ఈసారి మరింత ప్రత్యేకమైన ఈవెంట్‌తో ముందుకు రానున్నారు. హై ఎనర్జీ ఫోక్ మాస్ ఆంథమ్‌గా రూపొందిన ఈ సరికొత్త పాటను ఆగస్ట్ 28న అమెరికాలోని డల్లాస్‌లో జరిగే అనిరుధ్ లైవ్ కాన్సర్ట్‌లో వేలాది మంది అభిమానుల మధ్య గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం నేచురల్ స్టార్ నాని ఇప్పటికే డల్లాస్ చేరుకున్నారు. కాన్సర్ట్‌లో అనిరుధ్‌తో కలిసి నాని ప్రత్యక్షంగా సందడి చేయనుండటం విశేషం. లైవ్ కాన్సర్ట్ ప్రదర్శన అనంతరం ఆగస్ట్ 29న ఈ పాటను ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అధికారికంగా విడుదల చేయనున్నారు. మరోవైపు ఈ పాటకు సంబంధించి అప్పుడే ఇండస్ట్రీలో వైబ్రేషన్స్ మొదలవడం విశేషం.
ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, కాయదు లోహర్, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాప్ టెక్నికల్ టీమ్ పనిచేస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. సిహెచ్ సాయి సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ చిత్రం సెప్టెంబర్ 24న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో పాన్-వరల్డ్ స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి:
నా ఆత్మీయ మిత్రుడు ఇక లేరనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది: చిరంజీవి
‘హనుమాన్ అంశ్’.. బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రం సంచలనం
తుది దశకు చేరుకున్న విశ్వక్ సేన్ ‘లెగసీ’.. టార్గెట్ డిసెంబర్