Peddi: పెద్ది ఆగేదేలేదు.. ఈసారి గట్టిగా కొట్టేయడమే
ABN , Publish Date - Jan 06 , 2026 | 07:10 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ పెద్ది (Peddi).
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ పెద్ది (Peddi). ఉప్పెన సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు సానా (Buchibabu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత చరణ్ రేంజ్‌కు తగ్గ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు షికార్లు చేశాయి. తాజాగా ఆ రూమర్లన్నింటికీ చిత్ర యూనిట్ గట్టిగానే చెక్ పెట్టింది.
సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్‌లో ఉందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం పడుతుందని.. అందుకే సినిమా వాయిదా పడబోతోందంటూ వార్తలు వచ్చాయి. కానీ, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని వృద్ధి మూవీ మేకర్స్ స్పష్టం చేశారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్‌లో, మార్చి 27న సినిమా విడుదల కాబోతున్నట్లు మరోసారి నొక్కి చెప్పారు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ కు ఒక్కసారిగా చెక్ పెట్టినట్లయింది. ఇక ఈ సినిమా కోసం చరణ్ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథ కోసం ఆయన తన లుక్‌ను పూర్తిగా మార్చేశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ చూస్తేనే అర్థమవుతోంది.. చరణ్ ఈసారి బాక్సాఫీస్ వద్ద సిక్సర్ కొట్టడం ఖాయమని. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండటం ఈ ప్రాజెక్ట్‌కు మరో పెద్ద అసెట్‌గా మారింది. ఇక చికిరి చికిరి సాంగ్ అయితే యూట్యూబ్‌లో ఇప్పటికీ ట్రెండింగ్‌గా నిలిచింది. బుచ్చిబాబు మార్క్ ఎమోషన్స్‌తో పాటు రెహమాన్ మ్యూజిక్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే పెద్ది సినిమా కంటే సరిగ్గా ఒక రోజు ముందు అంటే మార్చి 26న నేచురల్ స్టార్ నాని తన ది ప్యారడైజ్ మూవీతో థియేటర్లలోకి వస్తున్నారు. దసరా వంటి మాస్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇద్దరు టాలెంటెడ్ డైరెక్టర్లు, ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటంతో టెన్షన్ మొదలైంది. ఏ సినిమా కూడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఒకవైపు రామ్ చరణ్ తన కంబ్యాక్ కోసం గట్టి పట్టుదలతో ఉంటే, మరోవైపు నాని తన సక్సెస్ స్ట్రీక్‌ను కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. మరి ఈ రెండు భారీ చిత్రాల మధ్య పోటీ ఎలా ఉండబోతోంది? మార్చి చివరి వారంలో బాక్సాఫీస్ వద్ద ఎవరు పైచేయి సాధిస్తారు అనేది చూడాలి.