Allu Arjun: ధురంధర్ డైరెక్టర్ తో అల్లు అర్జున్..
ABN , Publish Date - Feb 03 , 2026 | 01:32 PM
గతేడాది బాలీవుడ్ ఇండస్టీని షేక్ చేసిన చిత్రం ధురంధర్ (Dhurandhar). రణ్వీర్ సింగ్ (Ranveer Singh), సారా అర్జున్ జంటగా ఆదిత్య ధర్ (Aditya Dhar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డ్ కలక్షన్స్ రాబట్టింది.
Allu Arjun: గతేడాది బాలీవుడ్ ఇండస్టీని షేక్ చేసిన చిత్రం ధురంధర్ (Dhurandhar). రణ్వీర్ సింగ్ (Ranveer Singh), సారా అర్జున్ జంటగా ఆదిత్య ధర్ (Aditya Dhar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డ్ కలక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా విజయంతో ఆదిత్య ధర్ పేరు తెలుగులో కూడా మారుమ్రోగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆదిత్య ధర్ తో సినిమా చేయడానికి తెలుగు హీరోలు సైతం ఆసక్తి చూపుతున్నారు. అయితే ధురంధర్ కన్నా ముందే ఈ డైరెక్టర్ తో అల్లు అర్జున్ (Allu Arjun) టీమ్ అప్ అవ్వాల్సిందట. కానీ, కల్కి 2898 AD ఆ ప్లాన్ కి గండి కొట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి.
అసలు విషయం ఏంటి అంటే.. ఆదిత్య ధర్ మొదటి సినిమా ఉరి- ది సర్జికల్ స్ట్రైక్ తరువాత అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయడానికి ప్రయత్నించాడట. మైథలాజికల్ జానర్ లో అశ్వాత్థామ కథను తెరకెక్కించాలని ఆదిత్య ధర్ డ్రీమ్. ఆ కథను సిద్ధం చేసుకొని, అశ్వాత్థామ పాత్రకు బన్నీ అయితే సరిగ్గా సరిపోతాడని అనుకోని, ఆయనకు కథను కూడా వినిపించాడట. బన్నీ సైతం కథ బావుందని, కచ్చితంగా చేద్దామని హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. దీంతో డైరెక్టర్ ఆదిత్య ధర్ స్క్రిప్ట్ పనులను పూర్తిచేసుకొనే పనిలో ఉండగా కల్కి 2898AD రరిలీజ్ అయ్యింది.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అశ్వాత్థామ పాత్రలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించి మెప్పించారు. కల్కి సినిమాలో అశ్వాత్థామ పాత్రనే హైలైట్ కావడంతో.. మళ్ళీ అదే పాత్రతో కొత్త సినిమా చేసినా కూడా ప్రేక్షకులు దాన్ని, దీన్ని పోల్చి చూస్తారని.. ఆదిత్య ధర్ - అల్లు అర్జున్ తమ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అలా ధురంధర్ డైరెక్టర్ తో బన్నీ సినిమా మిస్ అయ్యినట్లు సమాచారం. అయితే ఈ కథను ఇప్పటికీ పక్కన పెట్టారా.. ? లేక పూర్తిగా పక్కన పెట్టేశారా.. ? అనేది తెలియాల్సి ఉంది.