త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత
ABN , Publish Date - Apr 22 , 2026 | 05:17 AM
నిర్మాత, నటుడు, అనలిస్ట్ త్రిపురనేని చిట్టిబాబు(56) (Chittibabu) ఇకలేరు. మంగళవారం రాత్రి కొండాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
నిర్మాత, నటుడు, అనలిస్ట్ త్రిపురనేని చిట్టిబాబు(56) (Chittibabu) ఇకలేరు. మంగళవారం రాత్రి కొండాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిట్టిబాబు అసలు పేరు వరప్రసాద్ (Varaprasad). 1970 జనవరి 1న కృష్ణా జిల్లాలోని కాజ గ్రామంలో త్రిపురనేని మహారథి, హేమలత దంపతులకు జన్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సుప్రసిద్ద రచయిత, నటుడు, నిర్మాత అయిన త్రిపురనేని మహారథి (Tripuraneni Maharathi) కుమారుడే చిట్టిబాబు.
తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వాన్ని చిట్టిబాబు కొనసాగించారు. తెలుగు సాహిత్యం, సినిమా రంగంలో మహారథి చేసిన గుర్తింపును చిట్టిబాబు తన వంతుగా గౌరవిస్తూ వచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్య నటుడిగా, సహాయ నటుడిగా అనేక చిత్రాల్లో ఆయన నటించారు. చిట్టిబాబు నిర్మాతగా కూడా వ్యవహరించారు. సినిమా నిర్మాణానికి సంబంధించిన చర్చల్లో, యూనియన్ వ్యవహారాలలో ఆయన క్రియాశీలకంగా ఉండేవారు.