Sarkaru Bai: నీటి కథ.. కన్నీటి వ్యధ
ABN , Publish Date - Jun 05 , 2026 | 07:58 AM
తెలంగాణ సామాజిక నేపథ్యం, నీటి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవన పోరాటం ఆధారంగా రూపొందుతున్న ‘సర్కారు బాయి’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది.
తెలంగాణ సామాజిక నేపథ్యంగా నీటి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవన పోరాటం కథాంశంగా రూపుదిద్దుకుంటున్న ‘సర్కారు బాయి’ (Sarkaru Bai) చిత్రం పస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవలే ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Bharadwaja Thammareddy) , దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య ముఖ్య అతిధులుగా పాల్గొని చిత్ర బృందానికి శుభాక్షాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హీరో శ్రీరామ్ (Sriram) మాట్లాడుతూ ‘తెలంగాణ సాయుధపోరాటం, సామాజిక అంశాలు కలగిన కథలు అంటే నాకు ఎంతో ఇష్టం. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం’ అన్నారు. కథ విన్న తర్వాత జాతీయ అవార్డ్ స్థాయి సినిమా అవుతుందనే నమ్మకం కలిగిందని హీరోయిన్ వర్షిక (Varshika) చెప్పారు. 1985లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు దర్శకుడు లారా చెప్పారు. ఈ చిత్రానికి నిర్మాత తుమ్మల ప్రపుల్ రామిరెడ్డి.