Seethakka: పాట పాడిన మంత్రి సీతక్క.. మీరూ విన్నారా! ట్రెండింగ్‌లో సాంగ్
ABN , Publish Date - Jan 18 , 2026 | 03:57 PM
మరో వారం రోజుల్లో దేశంలోనే రెండవ అతిపెద్ద కుంభమేళా, మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
మరో వారం రోజుల్లో దేశంలోనే రెండవ అతిపెద్ద కుంభమేళా, మేడారం సమ్మక్క సారక్క (SAMMAKKA SARAKKKA) జాతర ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు అభివృద్ధికి బ్జెట్ కేటాయించి చకచకా పనులు పైతం కొనసాగిస్తున్నారు. అయితే జాతర ఈ నెల 29న ప్రారంభం కానుండగా ప్రజలు ఇప్పటి నుంచే తమ ఇష్ట దైవాలను దర్శించుకునేందుకు ఇప్పటినుంచే పయనమవుతున్నారు. దీంతో పది రోజులు ముందే పండగ వాతావరణం వచ్చేసింది.
మరోవైపు తెలంగాణ అంటేనే పల్లె, జానపద పాటలకు ప్రసిద్ధి. అలాంటిది ఏదైనా పండుగ వస్తుందంటే యూట్యూబ్ ఇన్ఫ్లూయన్సర్స్, సింగర్స్, ఇతర కళాకారులు తమ టాలెంట్‌ను బయటికి తీసి ఒక్కొక్కరు ఒక్కో రీతిన వీడియోలు తీస్తూ ఉత్సవాలను మరింత రెట్టింపు చేస్తుంటారు. సంబంధిత పాటలను యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ఫోక్ సింగర్ గడ్డం సంతోష్ ఓ పాటను విడుదల చేశారు.
అయితే ఈ పాటను ప్రముఖ తెలంగాణ మంత్రి సీతక్క స్వయంగా ఆలపించడం విశేషం. అజాద్ (Azaad) ఈ పాటకు సాహిత్యం అందించగా సీతక్క (SEETHAKA) తో కలిసి గడ్డం సంతోష్ (GADDAM SANTHOSH), అజాద్ ఆలపించారు. కల్యాణ్ కీస్ (Kalyan keys) సంగీతం అందించగా మను మైఖెల్ (Manu micheal ) నృత్య రీతులు సమకూర్చారు. పాటలోని సాహిత్యం అమ్మవార్ల ఔన్నత్యాన్ని తెలియజేసేలా అద్భుతంగా ఉండగా నృత్య శైలి కూడా అదివాసిల గొప్పతనాన్ని తెలిపేలా ఉంది. పాట విన్న వారు సీతక్క గాత్రాన్ని, పాట పాడడాన్ని ప్రశంసిస్తున్నారు.