సినీ లవర్స్ కి గుడ్ న్యూస్.. ఇక నుంచి థియేటర్ లో అది ఫ్రీ

ABN , Publish Date - Mar 07 , 2026 | 07:32 PM

మూవీ లవర్స్ కు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) గుడ్ న్యూస్ తెలిపింది. ఆల్రెడీ టికెట్ల రేట్ల పెంపుతో జేబులు చిల్లులుపెట్టుకునే ఆడియెన్స్ కు థియేటర్లో కూడా చుక్కలు కనిపిస్తున్న విషయం తెల్సిందే.

Telangana

మూవీ లవర్స్ కు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) గుడ్ న్యూస్ తెలిపింది. ఆల్రెడీ టికెట్ల రేట్ల పెంపుతో జేబులు చిల్లులుపెట్టుకునే ఆడియెన్స్ కు థియేటర్లో కూడా చుక్కలు కనిపిస్తున్న విషయం తెల్సిందే. అసలు ఖర్చు కంటే కూడా కొసరు ఖర్చు ఎక్కువైపోతుంది. అయితే తాజాగా ఆ కొసరు ఖర్చుల్లో ఒకదానికి ఫుల్ స్టాప్ పడబోతోంది.సినిమా థియేటర్లకు వెళ్లే అభిమానులకు తెలంగాణ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమా చూసే ప్రేక్షకుల నుంచి ఇకపై పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదని ఆదేశించింది.

దిల్‌సుఖ్‌నగర్‌లోని కోణార్క్ థియేటర్లో ఒక ప్రేక్షకుడి నుంచి ₹20 పార్కింగ్ ఫీజు వసూలు చేయడంతో ప్రేమ్ రామావత్ అనే వ్యక్తి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో కోర్టు, సరైన కారణాలు లేకుండా సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఇచ్చిన మినహాయింపును తప్పుబట్టింది. మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్‌లో టికెట్ లేదా బిల్ చూపిస్తే ఉచిత పార్కింగ్ ఇవ్వాల్సిన నిబంధననే ఇకపై తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కూడా వర్తింపజేయాలని ఆదేశించింది.

గతంలో 2021లో జారీ అయిన GO 121 ద్వారా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలకు పార్కింగ్ ఫీజు వసూలు చేసే అనుమతి ఇచ్చినా, ఇప్పుడు దాన్ని సస్పెండ్ చేయడంతో సామాన్యుల జేబులకు భారీ ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చింది. టికెట్ ధరతో పాటు స్నాక్స్, పార్కింగ్ అంటూ అదనపు ఖర్చులతో ఇబ్బంది పడుతున్న ప్రేక్షకులకు ఇది పెద్ద రిలీఫ్. ఈ తీర్పుతో పార్కింగ్ టెన్షన్ తగ్గడం వల్ల థియేటర్లకు ఎక్కువ మంది ప్రేక్షకులు వస్తారని, బాక్సాఫీస్ వసూళ్లు పెరిగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

Updated Date - Mar 07 , 2026 | 07:38 PM