గద్దర్‌ అవార్డు వేడుకలో సమన్వయ లోపం.. పేర్లు కూడా తెలియకపోతే ఎలా..

ABN , Publish Date - Mar 19 , 2026 | 08:22 PM

హైటెక్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వేడుక వైభవంగా జరుగుతోంది. అయితే ఈవెంట్‌లో సమన్వయం లోపం ఉందని అతిథులు వాపోతున్నారు.

హైటెక్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల (Gaddar Film Awards) వేడుక వైభవంగా జరుగుతోంది. అయితే ఈవెంట్‌లో సమన్వయం లోపం ఉందని అతిథులు వాపోతున్నారు. ముంబైకి చెందిన ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ఈ వేడుక బాధ్యతలను తీసుకుంది. అయితే దీనికి సంబంధించిన టీమ్‌ అతిథులను, అవార్డు గ్రహీతలను గుర్తించక, వారి పేర్లు తెలియక రెడ్‌ కార్పెట్‌ దగ్గర సతమతమయ్యారట. అతిథుల పేర్లు తెలియక వారిని ఎంట్రీ వద్దే నిలిపేశారట.

రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సభ్యుల తీరుకు విసిగిపోయి అలిగారని కార్యక్రమం నుంచి వెనుదిరిగారని తెలిసింది. అలాగే ఆడిటోరియంలో ఏర్పాట్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని, అతిథులకు కూర్చోవడానికి సీట్లు కూడా లేని పరిస్థితి ఉందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. 

నేషనల్ క్రష్ రష్మిక మందన్న బౌన్సర్లకు దిల్ రాజు పిఎకు మధ్య మాటామాటా పెరిగింది. బౌనర్స్ కు సర్దీ చెప్పి దిల్ రాజు సిబ్బందిని  బయటకు వెళ్లమని  ఈవెంట్ ఆర్గనైజర్స్ సూచించారు.  అలాగే ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్, నిర్మాత డి.సురేష్ బాబు, నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డిను సైతం ఈవెంట్ ఆర్గనైజర్స్  వెనుక వరుసలోకి పంపారు. 

Updated Date - Mar 19 , 2026 | 10:08 PM