Mirai: తేజ సజ్జా ‘మిరాయ్’కు జపాన్‌లో సెన్సేషనల్ రెస్పాన్స్.

ABN , Publish Date - Aug 24 , 2026 | 05:52 PM

తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ‘మిరాయ్’ సినిమా జపాన్ లో సత్తా చాటుతోంది.

తేజ సజ్జా (Teja Sajja) హీరోగా తెరకెక్కిన ‘మిరాయ్’ (Mirai) సినిమా జపాన్ లో (Mirai in Japan) సత్తా చాటుతోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. పాన్ ఇండియా స్థాయిలో ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే.  ఇప్పుడీ చిత్రం జపాన్లో కూడా విడుదలైంది. ఈ నెల 21న అక్కడ విడుదలైన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన తొలి వీకెండ్‌లోనే  అక్కడ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. పలు భారీ జపనీస్, అంతర్జాతీయ చిత్రాలతో పోటీపడి అదిరిపోయే ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా ‘స్పైడర్‌మ్యాన్’ వంటి భారీ ఫ్రాంచైజ్ మూవీని సైతం అధిగమించడం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తొలి వీకెండ్‌లోనే ఈ స్థాయి స్పందన రావడం చిత్ర బృందానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. తేజ సజ్జా గతంలో ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘మిరాయ్’తో మరోసారి అంతర్జాతీయ మార్కెట్‌లో తన క్రేజ్‌ను చాటుకుంటున్నారు. ముఖ్యంగా జపాన్ ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. యాక్షన్, అడ్వెంచర్ అంశాలతో రూపొందిన ‘మిరాయ్’పై ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.  

Updated Date - Aug 24 , 2026 | 06:22 PM