ది ట్రేటర్స్.. హనుమాన్ హీరో హైప్ పెంచేశాడుగా

ABN , Publish Date - Sep 29 , 2026 | 03:19 PM

గ్లోబల్ స్థాయిలో భారీ ఆదరణ పొందిన పాపులర్ రియాలిటీ షో ది ట్రేటర్స్ (The Traitors) ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హను-మాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించి స్టార్ డమ్ సొంతం చేసుకున్న యంగ్ హీరో తేజ సజ్జ ఈ ప్రతిష్టాత్మక షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు.

The Traitors

గ్లోబల్ స్థాయిలో భారీ ఆదరణ పొందిన పాపులర్ రియాలిటీ షో ది ట్రేటర్స్ (The Traitors) ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హను-మాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించి స్టార్ డమ్ సొంతం చేసుకున్న యంగ్ హీరో తేజ సజ్జ ఈ ప్రతిష్టాత్మక షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో ఈ షోపై హైప్ పెరిగిపోయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అక్టోబర్ 15 నుంచి ఈ షో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ది ట్రేటర్స్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.


మైండ్ గేమ్స్, వ్యూహాలు, సస్పెన్స్‌తో కూడిన ఈ రియాలిటీ షో మొత్తం 10 ఎపిసోడ్లుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతీ గురువారం ఒక కొత్త ఎపిసోడ్ ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొనే పోటీదారులు ఫెయిత్‌ఫుల్స్, సీక్రెట్ ట్రేటర్స్ గా విడిపోయి సవాలుతో కూడిన టాస్కులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎవరు నమ్మకస్తులు, ఎవరు వెన్నుపోటు పొడిచే ద్రోహులు అనేది కనిపెట్టడమే ఈ షో ముఖ్య ఉద్దేశం. ఈ ప్రోమోలో కూడా గేమ్ ఎలా ఉంటుంది అనేది చెప్పుకొచ్చాడు. ఈ ప్రపంచంలో అందరూ మంచివారే.. మోసం చేసే అవకాశం రానంతవరకు అంటూ మొదలుపెట్టి ద్రోహులు ఉంటారు.. అందరిని మోసం చేసేవారు ఎలా గేమ్ ఆడతారు అనేది తెలియాలంటే ది ట్రేటర్స్ చూడాల్సిందే అని చెప్పుకొచ్చాడు.


ఓటీటీ ప్రపంచంలోకి రియాలిటీ హోస్ట్‌గా అడుగుపెట్టడంపై తేజ సజ్జ ఎంతో ఉత్సాహం వ్యక్తం చేశారు. సినిమాలతో పాటు అన్‌స్క్రిప్టెడ్ షోల ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశమని తెలిపారు. తేజ సజ్జకు ఉన్న సమయస్ఫూర్తి, చరిష్మా ఈ షోకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని, తెలుగు వెర్షన్ సరికొత్త మైలురాయిని క్రియేట్ చేస్తుందని ప్రైమ్ వీడియో ప్రతినిధులు ప్రశంసించారు.


హిందీలో కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వచ్చి విశేష ఆదరణ పొందిన ఈ అంతర్జాతీయ ఫార్మాట్, ఇప్పుడు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో తెలుగులో కూడా అందుబాటులోకి వస్తోంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ థ్రిల్లింగ్ రియాలిటీ షో కోసం తెలుగు బుల్లితెర ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - Sep 29 , 2026 | 03:30 PM