Chiranjeevi: మన శంకరవరప్రసాద్ గారి ఇంట్లో సక్సెస్ సెలబ్రేషన్స్..
ABN , Publish Date - Jan 12 , 2026 | 08:48 PM
: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నయనతార (Nayanthara) జంటగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu).
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నయనతార (Nayanthara) జంటగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu). షైన్ స్క్రీన్స్ బ్యానర్ తో కలిసి సుస్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా మంచి పాజిటివ్ టక తో దూసుకెళ్తుంది. వింటేజ్ చిరంజీవిని అభిమానులకు చూపించడంతో మెగా ఫ్యాన్స్ అనిల్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక ఫ్యామిలీస్.. చిరంజీవి డ్యాన్స్ కి, కామెడీ టైమింగ్ కి ఫిదా అవుతున్నారు.
భోళా శంకర్ ప్లాప్ తరువాత చిరంజీవి హిట్ అందుకోవడంతో ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీలో కూడా సంబురాలు అంబరాన్ని అంటాయి. అనిల్ రావిపూడిని చిరు స్వయంగా ఇంటికి పిలిచి శుభాకాంక్షలు తెలిపాడు. ఇక హిట్ తరువాత అనిల్ .. చిరును గట్టిగా హత్తుకొని ఎమోషనల్ అయ్యాడు. నిర్మాతలు సుస్మిత, సాహూ గారపాటి.. చిరుకు కంగ్రాట్స్ చెప్పారు.
మన శంకరవరప్రసాద్ గారు టీమ్ మొత్తానికి చిరు స్వీట్స్ తినిపించి సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకున్నారు. అనంతరం అందరూ కొద్దిసేపు చిరుతో ముచ్చటించారు. ఇక చివరలో అనిల్ ఏందీ బాసూ సంగతి అంటే.. చిరు అదిరిపోయింది సంక్రాంతి అని చెప్పి విజయానందంలో మునిగిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.