కార్మికుల దినోత్సవాన 'గాయపడ్డ సింహం'

ABN , Publish Date - Mar 23 , 2026 | 12:18 PM

తరుణ్‌ భాస్కర్ 'గాయపడ్డ సింహం' విడుదల తేదీ ఖరారైంది. మే 1న ఈ సినిమాను మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు.

Gayapadda Simham

ప్రముఖ దర్శకుడు తరుణ్‌ భాస్కర్ (Tarun Bhascker) హీరోగా నటించిన సినిమా 'గాయపడ్డ సింహం' (Gayapadda Simham). రైటర్ కశ్యప్‌ శ్రీనివాస్ దీన్ని డైరెక్ట్ చేశారు. మరో దర్శకుడు పవన్‌ సాదినేని (Pawan Sadineni) సమర్పణలో సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ దీనిని నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ రివీల్‌ చేశారు. మే 1 కార్మికుల దినోత్సవం నాడు 'గాయపడ్డ సింహం' జనం ముందుకు రాబోతోంది.


ఇప్పటికే మే 1న అడివి శేష్‌ (Adivi Shesh) నటించిన 'జి-2' (G 2) విడుదల అవుతుందని చెప్పారు. అయితే దీనికి ముందు రావాల్సిన 'డెకాయిట్‌' (Decoit) విడుదల వాయిదా కావడంతో... 'జీ2' ఇప్పటిలో రాదని తెలుస్తోంది. 'డెకాయిట్‌'ను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నారు. ఇక మే 1న అఖిల్‌ అక్కినేని 'లెనిన్‌' (Lenin) కూడా విడుదల కావాల్సి ఉంది. అలానే ధీరజ్‌ మొగిలినేని నిర్మించిన 'సమ్మర్‌ హాలిడేస్‌' మూవీ సైతం మే 1నే విడుదల కావాల్సి ఉంది. మరి అదే రోజున 'గాయపడ్డ సింహం' కూడా విడుదలైతే... ఎలా ఉంటుందో వేచి చూడాలి.

ఇదిలా ఉంటే... సరిగ్గా ఈ సినిమాకు ఒక రోజు ముందు రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ 'పెద్ది' కూడా విడుదల అవుతోంది. అలానే ఇటీవల దేశ వ్యాప్తంగా పాటతో వివాదాలకు కేంద్ర బిందువైన 'కేడీ: ద డెవిల్' మూవీ సైతం ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉంది.


'గాయపడ్డ సింహం'లో తరుణ్‌ భాస్కర్ హీరో కాగా మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా కథానాయికలుగా నటిస్తున్నారు. హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, విష్ణు ఓయి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి విద్యా సాగర్ చింతా సినిమాటోగ్రఫీ, విప్లవ్ నైషదం ఎడిటింగ్‌, సూర్య ప్రకాష్ జోశ్యుల కథను సమకూర్చుతున్నారు.

Updated Date - Mar 23 , 2026 | 07:48 PM