ఆర్య మిస్ట‌ర్ ఎక్స్.. తెలుగు ట్రైల‌ర్‌! హ‌లీవుడ్ రేంజ్‌ యాక్ష‌న్‌

ABN , Publish Date - Apr 10 , 2026 | 11:37 AM

ఆర్య హీరోగా గౌత‌మ్ కార్తీక్, శ‌ర‌త్ కుమార్, మంజు వారియ‌ర్, ఆతుల్య , అన‌ఘ, రైజా విల్స‌న్ కీల‌క పాత్రల్లో న‌టించిన త‌మిళ‌ చిత్రం మిస్ట‌ర్ ఎక్స్.

Mr. X

ఆర్య (Arya) హీరోగా గౌత‌మ్ కార్తీక్ (Gautham Karthik), శ‌ర‌త్ కుమార్ (Sarath Kumar), మంజు వారియ‌ర్ (Manju Warrier), ఆతుల్య (Athulya ) , అన‌ఘ (Anagha), రైజా విల్స‌న్ (Raiza Wilson) కీల‌క పాత్రల్లో న‌టించిన త‌మిళ‌ చిత్రం మిస్ట‌ర్ ఎక్స్ (Mr. X). మ‌ను ఆనంద్ (Manu Anand) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. హై ఓల్టేజ్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 17న ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు ప్రారంభించింది. తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేక‌ర్ప్ ఫ్లాన్ చేస్తున్నారు. గురువారం రాత్రి ఈ మూవీ త‌మిళ‌, తెలుగు వ‌ర్ష‌న్స్ ట్రైల‌ర్స్ విడుద‌ల చేశారు.

ఈ ట్రైలర్‌ చూస్తుంటే సాక్షాత్తు ఓ హాలీవుడ్ సినిమా చూడ‌బోతున్నామా? అన్న‌ట్టు ఉందంటే అతిశ‌యోక్తి కాదు. విజువ‌ల్స్‌, యాక్ష‌న్ స‌న్నివేశాలు ఇలా అన్నీ కూడా హై స్టాండ‌ర్డ్స్‌లో ఉండి ఔరా అనిపించేలా ఉంది. మంచి నైపుణ్యం ఉన్న ఓ ఇంటిలింజెట్ ఆఫీస‌ర్స్ టీం ఓ సైలెంట్ మిష‌న్ నిమిత్తం విదేశాల‌కు వెళుతుంది. కానీ ఆ ఆప‌రేష‌న్ విఫ‌లం అవ‌డంతో వారిపై దేశ‌ ద్రోహులనే ముద్ర ప‌డుతుంది. అదే స‌మ‌యంలో ఓ ర‌హ‌స్య ప్రాంత‌లో దాచి ఉన్న‌ న్యూక్లియ‌ర్ మిస్సైల్ కోసం శ‌త్రు దేశాలు రంగంలోకి దిగుతాయి. ఈ క్ర‌మంలో ఇండియ‌న్ టీం ఏం చేసింది, వారితో ఎలా పోరాడి విజ‌యం సాధించింది అనేది క‌థ.

ట్రైల‌ర్ ఆద్యంతం, క‌ళ్లు చెదిరే విజువ‌ల్స్‌, యాక్ష‌న్ సీన్ల‌తో మ‌తి పొగొట్టారు. ఇప్ప‌టికే ఇలాంటి జాన‌ర్ సినిమాలు మ‌నం అనేకం చూసిన‌ప్ప‌టికీ వాటికి భిన్నంగా ఈ మూవీని ఎక్క‌డా ఖ‌ర్చుకు వెనకాడకుండా తెర‌కెక్కించిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఆర్య నుంచి చాలా రోజుల త‌ర్వాత సినిమా రావ‌డం, పేరున్న న‌టీన‌టులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండటం ఈ సినిమాకు ఫ్ల‌స్ పాయింట్‌. ఈ చిత్రం జనాల‌ను ఏ మేర ఆక‌ట్టుకుంటుందో చూడాలి. ఇంకెందుకు ఆల‌స్యం ఇప్పుడే మీరూ ట్రైల‌ర్‌పై ఓ లుక్ వేయండి.

Updated Date - Apr 10 , 2026 | 01:33 PM