నెలాఖరుకు 'సుయోధన' ఆగమనం!
ABN , Publish Date - Mar 10 , 2026 | 03:47 PM
ప్రియదర్శి హీరోగా నటించిన మరో చిత్రం 'సుయోధన'. ఈ చిత్రం ఇదే నెలాఖరులో శ్రీరామనవమి కానుకగా విడుదల కాబోతోంది.
ప్రముఖ నటుడు ప్రియదర్శి, దృషిక చందర్ హీరో హీరోయిన్ నటిస్తున్న సినిమా 'సుయోధన'. ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్‌తో పాటు సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రను పోషించారు. వై.ఎస్. మాధవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'సుయోధన' మూవీ మార్చి 27న శ్రీరామ నవమి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ, 'మంచి కథా కథనాలతో, అత్యత్తమ ప్రమాణాలతో 'సుయోధన' చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతం అందించారు. బాణీలకు తగ్గ పాటలను రామజోగయ్య శాస్త్రి రాశారు. అతి త్వరలోనే ఈ సినిమా టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేస్తాం. మా సినిమాను శ్రీ లక్ష్మీ పిక్చర్స్ సంస్థ విడుదల చేయబోతోంది' అని అన్నారు. ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలను విష్ణు (లడ్డు), దేవిప్రసాద్, రాజశ్రీ నాయర్ తదితరులు పోషించారు.