సూర్య‌, మ‌మితా బైజు అద‌ర‌గొట్టారుగా! విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ టీజ‌ర్.. స‌మ్‌థింగ్ స్పెష‌ల్‌

ABN , Publish Date - Mar 16 , 2026 | 04:58 PM

సూర్య‌, మ‌మితా బైజు కాంబోలో వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ మూవీ టీజ‌ర్ విడుద‌లైంది.

Suriya

సూర్య (Suriya), మ‌మితా బైజు (Mamitha Baiju) జంట‌గా హిట్ డైరెక్ట‌ర్‌ వెంకీ అట్లూరి (Venky Atluri) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ (Vishwanath and Sons). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నిర్మితమవుతోంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలైలో ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల ఈ చిత్రం నుంచి సూర్య ఫ‌స్ట్‌ లుక్ రివీల్ చేసిన మేక‌ర్స్, తాజాగా మూవీ టీజ‌ర్ రిలీజ్ చేసి సినిమా కాన్సెప్ట్ ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేశారు.

ఇక టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే.. హీరో సంజ‌య్ విశ్వ‌నాథ్ మంచి షూట‌ర్ అయితే యువ‌కుడిగా అనేక ప‌త‌కాలు గెలిచిన ఆయ‌న వ‌య‌సు మీద ప‌డ్డాక కంటి చూపు స‌మ‌స్య వ‌ల‌న ఇబ్బందులు ఎదుర్కొంటుంటాడు. అదే స‌మ‌యంలో ఆయ‌న లైఫ్‌లోకి వయసులో స‌గం తేడా ఉన్న యువ‌తి వ‌స్తుంది. విశ్వ‌నాథ్ ఎంత దూరం పెడుతున్నా, కుద‌ర‌దని చెబుతున్నా ల‌వ్ అంటూ ప‌దే ప‌దే వెంట ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలో వీరి క‌థ ఏ తీరాల‌కు చేరింద‌నే అంశంతో ఈ సినిమాను రూపొందించిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

అయితే.. వెంకీ అట్లూరి, సూర్య ఈ మారు ఓ కొత్త కాన్సెప్ట్‌తో డేర్ చేస్తూ ప్రజ‌ల ఎదుట‌కు వ‌స్తున్న‌ట్లు స్ప‌ష్టంగా తెలుస్తోంది. కాగా గ‌తంలోనే వ‌చ్చిన‌ విక్ట‌రీ వెంక‌టేశ్‌ గురు సినిమా ఓ మోస్త‌రుగా ఇదే త‌ర‌హా క‌థ‌నంతో న‌డిచేదే కావ‌డం గ‌మ‌నార్హం. కాక‌పోతే బ‌ల‌మైన కుటుంబ సంబంధాలు, భావోద్వేగాల నేప‌థ్యంలో సినిమాను రూపొందించిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. విజువ‌ల్స్‌, జీవీ ప్ర‌కాశ్ ( GV Prakash) సంగీతం కూడా హైలెట్‌గా ఉన్నాయి.

Updated Date - Mar 16 , 2026 | 05:25 PM